ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే ఒక రోజు ఆ మహారాజు చాలా సంతోషంగా ఉంటాడు. ఇక ఆరోజు తన ఏడుగురు కుమార్తెలు కూడా కలిసి మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పే సమాధానం కనుక నాకు నచ్చితే మీరు కోరుకున్నది మీకు బహుమతిగా ఇస్తానని చెబుతాడు. కాబట్టి మీరందరూ కూడా వరుసగా నిలబడండి అని చెబుతాడు.

ఇక తర్వాత ఒక్కొక్కరు మీ సమాధానం చెప్పండి అని ఆయన అడగాల్సిన ప్రశ్న అడుగుతాడు. ఇక మహారాజు ఏమని అడుగుతాడు అంటే మీరంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు, ఎవరి ఆహారం తింటున్నారు, అలాగే ఎవరు ఇచ్చిన దుస్తులు ధరిస్తున్నారు, సమాధానం చెప్పమని అంటాడు. ఇక మహారాజు ఆరుగురు కుమార్తెలు కూడా తండ్రిగారు మేమందరం కూడా మీదే ఆధారపడి ఉన్నాము. మీరు ఇచ్చిన ఆహారమే తింటున్నాము,

మీరు ఇచ్చిన దుస్తులే ధరిస్తున్నాము, అని చెబుతారు ఇంకా చెప్పాలి అంటే మా జీవితం కూడా మీరు పెట్టిన బిక్షే, కాబట్టి మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నామని చెబుతారు. ఇక ఆరుగురు కుమార్తెలు చెప్పిన మాటలు విని మహారాజుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఆరుగురు కూతు ర్లకు కూడా వారు అడిగిన ఇష్టమైన వస్తువులన్నీ కూడా బహుమతిగా ఇస్తాడు. ఇక చివరిగా మహారాజు యొక్క చివరి కుమార్తె వంతు వస్తుంది. అయితే ఆ అమ్మాయి మాత్రం ఆరుగురు అక్కలు చెప్పిన విధంగా సమాధానం ఇవ్వదు. నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను, నాకు ఈ జీవితం కూడా ఆ దేవుడే ఇచ్చాడు,

తండ్రి గారు నా జీవితం ఆ దేవుడు పెట్టిన భిక్ష, ఈరోజు నేను అనుభవిస్తున్న నా సుఖసంతోషాలు అన్నీ కూడా, ఆ దేవుడు నా తలరాతలో రాసినవి. అందుకే నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను అని చెబుతుంది. ఇక ఆ మాట విన్న వెంటనే మహారాజుకి ఎంత కోపం వస్తుంది. వెంటనే ఓ మూర్ఖురాలా నువ్వు నన్ను నిజంగా అవమానించావు, కాబట్టి నువ్వు చెప్పిన సమాధానానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అంటాడు. అయితే యువరాణి మాత్రం మళ్లీ మాట్లాడుతూ మీరు ఏ శిక్ష వేధించిన నేను అనుభవించడానికి సిద్ధం తండ్రిగారు అని సమాధానం ఇస్తుంది.

అంతేకానీ నా సమాధానాన్ని మాత్రం మార్చుకోనని చెబుతుంది. ఇక వెంటనే ఆక్రయించిన మహారాజు సైనికులను పిలిచి యువరాణిని అడవిలో విడిచిపెట్టి రమ్మని ఆదేశిస్తాడు. ఇక అప్పుడు తనకు కూడా తెలుస్తుంది, నా దయ లేకుండా నా సహాయం లేకుండా తను ఆ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని ఎలా తింటుందో, తన తలరాతలు ఆ దేవుడు రాసిన దుస్తువులను సుఖసంతోషాలను ఎలా అనుభవిస్తుందో, నేను చూస్తాను అని అంటాడు. అంతేకాకుండా ఇవ్వరానిని అడవికి పంపే ముందుగా రా కుమార్తెనుండి నగలన్నీ కూడా వెనక్కి తీసుకోమని, రాజు ఆదేశాల మేరకు ఎటువంటి ఆమెకు సంబంధించిన వస్తువును కూడా ఇవ్వకుండా సాధారణమైన దుస్తులలో ఆమెను సైనికులు వదిలేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/IdoSncIwsBs