కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛారణ చేసి స్వామికి అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.

అయితే తమ కష్టాలు అన్నీ పోయి, అందరూ బాగుండాలి కోరుకుంటూ కొబ్బరికాయని కొడుతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపొతే ఎంతో ఆందోళన చెందుతారు.తమ కోర్కెలు తీరవా, ఎందుకు కుళ్ళిపోయింది అంటూ ఆందోళన చెందుతారు.

కొంతమంది కొబ్బరికాయ కుళ్ళి పోవడం మంచిదే అంటారు. ఇంకొంతమంది కొబ్బరి కాయ కుళ్ళక పోవడం మంచిది అంటారు. ఇలా ఎవరి మాట నమ్మాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. కొబ్బరికాయ కుళ్ళితే అశుభం అని చాలా మంది అనుకుంటారు కానీ కుళ్ళి పోవడానికి, అశుభానికి సంభంధం లేదని మనం ఎంత భక్తితో దేవుడికి సమర్పించాము అనేది మాత్రమే ముఖ్యమని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా పండితులు అంటున్నారు.

కొబ్బరికాయ కొట్టినపుడు ఒక వేళ గనుకా అది కుళ్ళిపోతే కాళ్ళు చేతులు శుబ్రంగా కడుక్కుని, మళ్ళీ పూజలోకి వెళ్లి దేవుడి వద్ద కాసేపు ధ్యానం చేస్తే సరిపోతుందట. కొబ్బరి కాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అది చేసే పనికి శుభ సూచకమని అర్థమట. అదే పెళ్ళయిన దంపతులు కొట్టినప్పుడు పువ్వు వస్తే త్వరగా పిల్లలు పుడతారని సంకేతమట. అయితే కొబ్బరి కాయ కుళ్ళిపోయిందని మధన పడకుండా దేవుడి వద్ద మనస్పూర్తిగా ధ్యానం చేస్తే చాలని అంటున్నారు వేద పండితులు.