దెయ్యాల గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అంటుంటారు…నిజంగా ఉన్నాయా అనే విషయాలను చూస్తే సైన్స్ విషయానికొస్తే..అది అపద్దమే అంటున్నా రు శాస్త్రవేత్తలు.. దెయ్యాలు కేవలం మనిషి సృష్టించిన అపోహ మాత్రమే..

అయితే సినిమాల్లో చూపించినట్లుగా ఆత్మలకు ఆకారం ఉండకపోవచ్చు. అలాగే వాటికి, మాయలు.. మంత్రాలు కూడా రాకపోవచ్చు. ఆత్మలు తిరుగుతున్నాయనేది కేవలం ఊహ మాత్రమే అనే భావన ఉంది. అయితే, ఏడు మానసిక, శారీరక కారకాలు ఏదైనా గగుర్పాటు కలిగించే సంఘటనలకు కారణమవుతాయి.

ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న హర్రర్ సినిమాలు, క్యాంప్‌ఫైర్‌లో చెప్పుకునే సరదా దెయ్యం కథలు మనకు తెలియకుండానే మన మనసులో నాటుకుపోతాయి. అంటే, ‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతికలా కథలు విని, వాటిలోని పాత్రలతో ఊహాలోకాన్ని ఏర్పాటు చేసుకుని స్ప్లిట్ పర్శనాలిటీగా మారిపోవడం.

వేధింపులకు గురైన లేదా ప్రమాదకర పరిస్థితులకు గురయ్యే పిల్లలు పారానార్మల్ ఫాంటసీలను కలిగి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముందుగా ‘చంద్రముఖి’లో జ్యోతిక ఫ్లాష్‌బ్యాక్‌లో చూపినట్లే.. చిన్నప్పుడు మనసుకు కలిగే గాయాలు.. పెద్దయ్యాక మానసిక ప్రభావాన్ని చూపుతాయి. స్ప్లిట్ పర్శనాలిటీకి దారి తీస్తాయి.

మీకు తెలియకుండానే మీరు ఇద్దరిలా ప్రవర్తిస్తారు. ‘స్కిజోఫ్రెనియా’ అనే సమస్య కలిగిన వ్యక్తులకు కొన్ని స్వరాలు వినడం, ఆకారాలను చూసిన అనుభూతి కలుగుతుందట. మెదడులో అంతర్గత సమస్యలున్న వ్యక్తులు పారానార్మల్ ఘటనలను ఎదుర్కొంటున్నట్లు ఫీలవుతారట. మానసిక అనారోగ్యం లేనివారిలో కూడా మెదడులో తాత్కాలిక మార్పులు ఈ భయాలను ప్రేరేపిస్తాయట.