దొండకాయలు తరచూ మనం వాడుతుంటాం, దొండకాయ సంవత్సరం మొత్తం దొరికే కాయ. దొండకాయ గురించి అందరికీ తెలిసిన ఇందులో ఉండే అద్భుత పోషక విలువల గురించి అందరికీ తెలియదు. కొంతమంది దొండకాయలు తింటే మంద బుద్ధి వస్తుందని అంటారు, అసలు ఆ మాటల్లో నిజం ఎంత ఉంది ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, దొండకాయ చాలా సహాయం చేస్తుంది. దొండకాయ మనకు మంచి ఆరోగ్యంతో పాటు, అందాన్ని ఇస్తుంది. దొండకాయను కూరగా వండుకొని మరియు పచ్చిగా కూడా తింటారు. పచ్చిగా తింటే ఎక్కువ పోషక విలువలు పొందవచ్చు.

దొండకాయలు మెదడు మరియు నాడీ వ్యవస్థ పని పనిచేసే పనితీరు, మరియు మెరుగుపరిచే బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తరచూ మనం దొండ కాయ తినడం వల్ల, మెదడు యొక్క జ్ఞాపక శక్తి అమాంతం పెరుగుతుంది. చదువుకునే పిల్లలు తినడం వల్ల వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, ఆయుర్వేదం ప్రకారం దొండకాయ వాడడం వల్ల అలసట, పని ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తుంది. మరియు మంచి ఆలోచనలు కలిగి మెదడు చురుకుగా అయ్యేలా చేస్తుందని, పరిశోధకులు అంటున్నారు. దొండకాయ లో తయామైన అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చి, మన శరీరానికి శక్తిని ఇస్తుంది. అంతేకాదు మన శరీర జీవక్రియ రేటును పెంచుతుంది.

దొండకాయ లో యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే విటమిన్ సి, బీటాకెరోటిన్, అధికంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. తరచుగా ఈ దొండకాయలు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా, మనల్ని కాపాడుతుంది. దొండకాయ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కిడ్నీలో రాళ్లను ఏర్పడకుండా చేస్తుందని, తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు తరచూ దొండకాయను మన ఆహారంలో భాగంగా తింటుంటే, కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుందని, పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది, పచ్చి దొండకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

దొండకాయ లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. వయసుపైబడిన సరే ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. దొండకాయ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. పొటాషియం గుండె యొక్క పనితీరును లో సహాయం చేస్తుంది. గుండె అన్ని అవయవాలకు రక్త సరఫరా జరిగేలా చేస్తుంది, అంతే కాదు గుండె పోటు రాకుండా చేస్తుంది. మనం దొండకాయ తింటూ ఉంటే చిన్న చిన్న రోగాలు మనల్ని దరి చేరకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి౨, విటమిన్ బి౧, మన రోగనిరోధక శక్తిని పెంచి, మనల్ని శక్తి వంతంగా చేస్తుంది.