చాలామంది దగ్గు, జలుబు వం టి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యం గా దగ్గు సమస్యలతో బాధపడేవారు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.

ఈ క్రమంలోనే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే తొం దరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడే వారికి తేనె ఒక మంచి ఔషదం అని చెప్పవచ్చు. తేనెలో ఎన్నో యాంటీబ్యా క్టీరిక్టీయల్, యాం టీ వైరల్ లక్షణాలు దాగి ఉన్నాయి కనుక ప్రతిరోజు ఉదయం, గోరువెచ్చని నీటిలోకి తేనె కలుపుకొని తాగడం ద్వారా దగ్గు నుంచి తొం దరగా ఉపశమనం పొందవచ్చు.

అదేవిధంగా మన ఇంట్లో ఎన్నో వంటలలో ఉపయోగించే వెల్లుల్లి దగ్గుకు ఒక మం చి పరిష్కార మార్గం .వెల్లుల్లి ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి కనుక ప్రతి రోజు మనం వెల్లుల్లినిల్లి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొం దవచ్చు. ముఖ్యం గా దగ్గు సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని వేయించి, ఒక చెం చా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.

వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి కనుక పసుపును ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.దగ్గు సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల దగ్గు నుంచి తొం దరగా ఉపశమనం పొందవచ్చు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…