శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

మొదట ఆమె ధడక్ సినిమాలో వెండితెరకు పరిచయమై మంచి నటిగా గుర్తింపుని అందుకుంది. ఆ తర్వాత చాలా తొందరగానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే కూడా ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగానే మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటోంది.

అయితే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టింది.రీసెంట్ గా తిరుమల వచ్చింది. కాలి నడకన కొండకి చేరుకొంది. ఆ పై మోకాళ్లపై నడుచుకుంటూ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కింది. మాములు మనలాంటి వాళ్ళమే మోకాళ్ళ పై మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కడానికి చాలా కష్టపడతాం. అలాంటిది జాన్వీ లాంటి సెలబ్రిటీ కష్టాన్ని మర్చిపోయి అలా ఎక్కడం నిజంగా గ్రేట్.

ఆ సమయంలో ఉన్న కొంత మంది భక్తులు జాన్వీని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఈ సంఘటనతో జాన్వీ వేంకటేశ్వర స్వామి భక్తురాలనే విషయం కూడా అందరకి అర్ధం అయింది. ఆ తర్వాత మనసు నిండా భక్తిని నింపుకొని స్వామిని దర్శించుకొని పులకరించిపోయింది. జాన్వీ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.