స్వామివారి అభిషేకానికి ఆలస్యమైపోతుంది, అర్చకులకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఇక అభిషేకం చేయలేమేమో అనుకొని అర్చకుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరికొందరికి భయంతో గుండెలదిరాయి అసలు ఏం జరిగింది స్వామివారి అభిషేకం ఆరోజు ఎందుకు చేయలేకపోతున్నారు.

అభిషేకం చేయకుండా అర్చకుల చేతులను కట్టివేయబడడానికి కారణం ఏమిటి. ఇంతకీ అభిషేకం జరగనుందా లేదా. స్వామివారి అభిషేకం ఆగిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం మొదట పిల్లి గురించి తెలుసుకోవాలి. అసలు స్వామివారి అభిషేకానికి పిల్లికి ఉన్న సంబంధం ఏమిటి అని మీకు అనిపించవచ్చు.

అసలు ఈ పునుగు పిల్లి లేకపోతే శుక్రవారం జరిగే స్వామివారి అభిషేకం అసంపూర్ణమవుతుంది. పునుగు పిల్లి ఇది చాలా అంతరించిపోతున్న జంతువు శుక్రవారం స్వామివారి అభిషేకం అయ్యాక ఈ పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి పులిమితే ఆ అభిషేకం సంపూర్ణమవుతుందని అప్పుడే స్వామి వారు శాంతిస్తారని చెబుతూ ఉంటారు. అసలు ఈ తైలం పునుగుపల్లి నుండి ఎలా వస్తుంది అంటే, ఒక ఇనుప జల్లెడ గదిలో ఒకరంద్రం గుండా ఎర్రచందనపు కొయ్య ఉంచుతారు.

అందులోకి టీటీడీ వాళ్ళు సురక్షితంగా పెంచుతున్న ఒక పునుగు పిల్లిని పంపిస్తారు. ఆ చందనపు గరుడకి తన హావ భావాలను వ్యక్తపరుస్తూ, పిల్లి తన శరీరాన్ని రుద్దగానే ఆ పిల్లి శరీరపు స్వేద గ్రంధుల నుంచి శ్రమించే ద్రవం ఆ గరిటకు అంటుకుంటుంది. ఆ పిల్ల నుంచి వచ్చే తైలపు సువాసన దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఇదేనేమో తిరుమల లో మనం గమనిస్తే ఒక అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది.

ఆ ద్రవాన్ని తీసి రకరకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి లేపనంగా చేసి శుక్రవారం స్వామి వారి అభిషేకం అయ్యాక, నిగనిగలాడే సుందరమైన స్వామివారి విగ్రహానికి పూయగానే, స్వామి వారు ఆ సువాసన కి శాంతిస్తారు. కానీ ఒకరోజు అంతరించిపోతున్న పునుగుపిల్లి లేకపోవడంతో, అర్చకులకి విషయం తెలిసి కంగారు పడ్డారు. ఇప్పటికి ఇప్పుడు అలాంటి అరుదైన పిల్లిని వెతికిన దొరికే అవకాశం లేదు. మరి అభిషేకం సరైన సమయానికి జరగకపోతే, స్వామివారి ఆగ్రహాన్ని తట్టుకునే శక్తి మనకి ఎక్కడిదని అర్చకుల కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.