తిరుమలలో లక్షల అధి రూపాయలు లభించాయి. బిచ్చగాడు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన టీటీడీ అధికారులకు ఇంటి నిండా డబ్బు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. లక్ష రెండు లక్షల కాదు, ఏకంగా 10 లక్షల రూపాయలు నగదు ఆ ఇంట్లో లభించడం ఆశ్చర్యంగా మారింది.

ఈ డబ్బంతా తిరుమలలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించి మృతి చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి నుంచి టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసచారికి 2007లో తిరుమల సమీపంలో శేషాచలంలో ఇంటి నెంబర్ 75న పొందాడు. అప్పటినుండి తిరుమల లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాడు,

బిక్షాటన చేస్తూ, భారీగా నగదు పోగు చేసుకున్నాడు. తన సంపాదించిన సొమ్ము ఇంట్లోనే భద్రపరచుకుంటూ వచ్చాడు. అయితే గత ఏడాది ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. శ్రీనివాసాచారికి వారసులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ సదరు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగానే సోమవారం విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు శేషాశల నగర్ కి చేరుకొని తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ఇంటిలోని పలు వస్తువులు తనిఖీ చేయక రెండు ట్రక్కు పెట్టెలలో చిల్లర నగదు కరెన్సీ నోట్లు పెద్ద ఎత్తున కనిపించాయి. ఇందులో రద్దు చేసిన బాధ 500 నోట్లు వెయ్యి రూపాయల నోట్లు నోట్లు కూడా ఉన్నాయి. ఇవి సుమారు పది లక్షలు ఉంటాయని వాటిని స్వాధీనం చేసుకొని, ట్రెజరీకి తరలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.