జీవితంలో ప్రేమించిన వ్యక్తులు దూరమైన, ప్రేమ మాత్రం సజీవంగానే ఉంటుంది. వారితో గడిపిన మధుర క్షణాలని తీపి గుర్తులుగా బ్రతికేస్తూ ఉంటారు.

అలాంటి కోవకు చెందిన వారిలో అమృత ప్రణయ్ కూడా ఒకరు. మిర్యాలగూడ కి చెందిన అమృత ప్రణయ్ ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రణయ్ అతి దారుణంగా హత్యకు గురి కావడం అనేది, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్నాళ్ళకి అమృత ప్రణయ్ బిడ్డకి జన్మనిచ్చింది.

అలా ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ తన జీవితంలో జరిగిన ఒక దారుణాన్ని, అధిగమించి ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుంది. దీంతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో తన భర్తకి సంబంధించి మెమోరీస్, మెమోరబుల్ మూమెంట్స్ ని అన్ని షేర్ చేస్తుంది. అలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అమృత తన తండ్రి మరణం తర్వాత తల్లితో కూడా కలిసిపోయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అమృత తన తల్లితో కొడుకుతో కలిసి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీవితంలో ప్రతి కష్టాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలిగే సత్తాను ధైర్యాన్ని కాలమే ఇస్తుంది అంటారు. ఇది నిజంగా అమృత జీవితానికి వాస్తవంగా దగ్గరగా ఉంటుంది. తన జీవితంలో జరిగిన విషాదఘటనని దిగమింగుకొని, తన కొడుకును చూసుకుంటూ లైఫ్లో ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని లుగా తన తల్లితో విభేదాలను విడిచి కలిసిపోయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా, అమృత తల్లి కొడుకు నిహాన్ హైదరాబాద్ కి తరలివచ్చారు. అందుకో సంబంధించిన వీడియోను అమృత తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో తల్లిని రాగానే పలకరిస్తూ, వీడియో తీస్తుంది. అలాగే తన తల్లిని ఎప్పుడూ బయలుదేరారు అని అడుగుతూ పలు విషయాలని ఇద్దరూ చర్చించుకుంటారు.

https://youtu.be/5rSxXeLsLFg

ఇక తర్వాత నిద్రపోతున్న తన కొడుకు నిహాన్ని గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక కొడుకు నిద్ర లేవడంతో ఈ వీడియోను కొనసాగించాలని ఉన్న, తన కొడుకును చూసి దాదాపు వారం రోజులు అయింది, అందుకే వీడియో తీయాలని లేదు వాడితో ఆడుకోవాలని, సరదాగా గడపాలని ఉందని చెబుతూ వీడియో ని ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు, అమృత తన లైఫ్ లో తన కొడుకుతో సంతోషంగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు.