ఈరోజు మనం ఎన్నో అద్భుత గుణాలను తనలో నింపుకున్న, ఎంతో అద్భుతమైన మొక్క గుంటగలగర మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను ఈమధ్య కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య గారు, తన అవషధoలో వాడారు.ఈ గుంటగలగర మొక్క గురించి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే, ఈ గుంటగలగర మొక్క ఎంతగానో సహాయం చేస్తుంది, 100 ఏళ్ళ ఆయువును అందించగల రసాయనం అని దీనిని సేవించి, తమ వయసును పెంచుకున్న ఎందరో సాదువులు తమ అనుభవాలను రాశారు.

పూర్వకాలంలో మన పెద్దలు ఈ గుంటగలగర మొక్క యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని, దీనిని కేవలం తలవెంట్రుకల దృఢత్వం కోసమే కాకుండా, పచ్చడిగా అలాగే అవిశదంగా కూడా తయారు చేసుకుని, తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఈ మొక్క ని తెలుగులో గుంటగలగర మొక్క అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ మొక్కని brungaraj లేదా keshraj అని పిలుస్తారు. ఈ మొక్కను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క నీటి కుంటల పక్కన, తేమ గల ప్రదేశంలో, పెరిగే ఒక విధమైన ఔషధ మొక్క, ఈ మొక్కలు మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి.

ఈ మొక్కకు తెల్లటి పువ్వులు పూస్తాయి. వీటి ఆకులు అలాగే వారుగా ఉంటాయి. ఇవి సంవత్సరం మొత్తం కూడా, నీరు అధికంగా లభించే ప్రదేశాలలో, తేమ ప్రదేశాలలో లభిస్తూ ఉంటుంది.ఈ మొక్క మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం చెప్పుకోవచ్చు, ఈ గుంటగలగర మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందింది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా అని అంటారు. ఇందులోనే ఔషధ తత్వం గ్రహించి తల నూనెల కంపెనీ వారు, వారి యొక్క ఉత్పత్తుల్లో వాడుతున్నారు. వెంట్రుకలు రాలిపోకుండా ఉండే గుణమే అందుకు కారణం. ఈ మొక్కకు మార్కెట్లో విలువ ఉంది. అమ్మకపు విలువ ఉంది.

ఆధునిక పరిశోధనల్లో ఇందులో ఉండే ఎక్లిప్టా అనే అవశద తత్వానికి, లివర్ను బాగుచేయకలిగే శక్తి ఉందని కనుగొన్నారు.ఈ మొక్క అధర్వణ వేదంలో గొప్పగా చెప్పబడింది. అందులో ఈ మొక్క జ్ఞాపకశక్తిని పెంచే, మెదడుని ఆరోగ్య పరుస్తుందని, పెద్ద దోషాలను నయం చేస్తుందని, అలాగే జుట్టు తెల్లబడకుండా జుట్టు రాలకుండా కాపాడుతుందని, పళ్ళకు, దంతాలకు, మంచి ఆరోగ్యాన్ని పంచుతుందని, కామెర్ల వ్యాధి నయం కావడానికి, అద్భుత ఔషధంగా పనిచేస్తుందని, అధర్వణ వేదంలో చెప్పబడింది.