ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇక తమన్నా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది.

అయినప్పటికీ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా తన లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీయ ఎంజాయ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోని తమన్నా ఇన్ని దశాబ్దాల సినిమాలతో ఎంత సంపాదించింది అన్న విషయం ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే దాదాపుగా 17 ఏళ్ల నుండి టాలీవుడ్ లో హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా ఒక్కో సినిమాకి గాను నాలుగు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.దాంతోపాటు కమర్షియల్ యాడ్స్ పలు బ్రాండెడ్ ప్రాజెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది తమన్నా. అలా కొన్ని కోట్ల రూపాయనే తన ఖాతాలో వేసుకుంటుంది.

దాంతోపాటు తమన్నకి ఫారిన్ కంట్రీస్ లో కూడా బడా బిజినెస్ లు ఉన్నాయని అంటారు. అయితే 2017 వైట్ అండ్ గోల్డ్ పేరుతో జువెలరీ బిజినెస్ సైతం ప్రారంభించింది తమన్నా. ఇందులో ఈ బ్యూటీ బాగా సక్సెస్ అయింది దాంతోపాటు వారసత్వంగా వచ్చే ఆస్తి కూడా తమన్నాకి ఉందని అంటున్నారు. ఇక అలా అన్నీ కలిపి ఎంత కాదన్నా 220 కోట్లకు పైగానే తమన్నకి ఆస్తి ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు తమన్న వద్ద రెండు భారీ వజ్రాల మూటలు కూడా ఉన్నాయని ఎప్పటినుండో అంటున్నారు. వాటితో పాటు పలు ప్రాపర్టీలు కార్లు ఫ్లాట్స్ విల్లాస్ కూడా తమన్నాకి ఉన్నట్లుగా తెలుస్తోంది.