నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారా? వారు సంచరించే టప్పుడు మనం ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందా? తధాస్తు అంటే అది జరిగి తీరాల్సిందే నా? అసలు తధాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

మనం అనకూడని ఏదైనా అంటే మన పెద్దలు అలా అనకండి పైన తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్లు తధాస్తు అంటే అదే జరుగుతుంది అని అనడం చాలా మంది వినే ఉంటారు. నిజంగా తధాస్తు దేవతలు ఉన్నారా అంటే ఉన్నారు.

తధా అంటే ఆ ప్రకారంగా అస్తు కావలసిందే లేదా జరగాల్సిందే అని అర్థం. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట అనేకసార్లు అనుకుంటూ ఉంటే తథాస్తు దేవతలు వెంటనే తధాస్తు అంటారు. తథాస్తు అనే వారినే తధాస్తు అంటారు.

పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి, ఈమెనూ శరణ్య దేవి, లేదా సంధ్య దేవి అని కూడా పిలుస్తారు. ఈమె సూర్యుని యొక్క అఖండ తేజస్సుని భరించలేక, ఆమె ఒక గుర్రం రూపం ధరించి గురు దేశం వెళ్తుంది. అప్పుడు గురు దేశంలో గుర్రం రూపంలో ఉన్న సంధ్య దేవిని సూర్యుడు చూసి తను కూడా గుర్రం రూపం ధరించి సంధ్య దేవి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారుడు. వారిని అశ్విని దేవతలు అంటారు. వీరే తధాస్తు దేవతలు. వీరిని దేవత, వైద్యులు అనే కూడా పురాణాలు చెబుతున్నాయి.

వారి యొక్క రథం బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఆ రథంపై అత్యంత వేగంగా ప్రయాణించే వారు వీరు. వారు ప్రయాణించే మార్గంలో వారు తధాస్తు అనే నామాన్ని చెబుతూ అదే విధంగా వేద మంత్రాలను ఆహ్వానిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. మంచుతో బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చి అధిపతులను, మరియు యజ్ఞ ద్రవ్యాలను, బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అదేవిధంగా మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాల నుంచి సత్యాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తారు. నిత్యం పూజలు చేస్తూ, జపం చేసే మంచి ప్రవర్తన ఉన్న ఉత్తమ పురుషులకు కూడా ఈ తధాస్తు శక్తిని తధాస్తు దేవతలు ప్రసాదిస్తారట..

మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.