ఒక తండ్రి తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతాడు, ఏ కష్టం రానీయకుండా తన భుజాలపై మోస్తాడు. తాను పస్తులు ఉండి పిల్లల కడుపు నింపే మనస్తత్వం తండ్రిది.

కష్టపడి పైసా పైసా కూడబెట్టి పిల్లల కోసం సంపాదిస్తాడు, అలాంటి తండ్రి మనసును అర్థం చేసుకోలేని వాళ్ళు దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన తండ్రిని అతి క్రూరంగా అంతముందిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సహజ మరణంగా చిత్రీకరిస్తున్నారు.

ఇలాంటి ఒక ఘటన మెదక్ జిల్లా చేగు ంట మండలం అనంతసాగర్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతసాగర్ కు చెందిన కృష్ణయ్య భార్య లచ్చవ్వ కుమారుడు స్వామి, కుమార్తె రేణుక సత్తువలు ఉన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన అశోక్తో కలిసి రేణుక పుట్టింటిలోనే ఉంటుంది. కృష్ణయ్య మద్యం తాగి వచ్చి తిడుతూ ఉండడంతో, కుమారుడు కుమార్తె అల్లుడు కక్ష పెంచుకున్నారు.

2022 జూలై 16వ తేదీన లచ్చవ్వ సత్తెవ్వ వేరే ఊరికి వెళ్లడంతో, ఆ రాత్రి కిష్టయ్యను అంతమొందించేందుకు, ఆ ముగ్గురు ప్లాన్ వేశారు. ప్రతిరోజు లాగే మద్యం తాగి వచ్చాడు కృష్ణయ్య. అదే అదునుగా భావించిన ముగ్గురు ఆయన ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా హతమార్చారు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు కొడుకు స్వామి పొలానికి వెళ్ళాడు. తండ్రి చనిపోయాడని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చాడు. కృష్ణయ్య భార్య చిన్న కుమార్తె సహజ మరణంగా భావించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇటీవల భర్త మరణం పై అనుమానం రావడంతో, భార్య లచ్చవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డి.ఎస్.పి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో, కుమారుడు స్వామి కుమార్తె రేణుకను అదుపులోకి తీసుకొని విచారించగా, హత్య చేసినట్లు అంగీకరించారు. న్యాయమూర్తి అనుమతితో స్మశాన వాటికలో కృష్ణయ్యను, పూడ్చిన ప్రదేశంలో తవ్వి, మృతదేహాన్ని బయటకు తీశారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్ల సహాయంతో అక్కడే పోస్ట్మార్టం నిర్వహించారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కుమారుడు స్వామి, కుమార్తె రేణుకను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అశోక్ గతంలోనే చనిపోయినట్లు చెప్పాడు. డి.ఎస్.పి యాదగిరిరెడ్డి రామయ్యపేట సిఐ లక్ష్మీబాయి, హరీష్ ఏఎస్ఐ రవీందర్ కానిస్టేబుల్ గణేష్ భాస్కర్ ను అభినందించాడు. కన్నతండ్రిని అంతమొందించినా కొడుకు, కుమార్తె చివరికి కటకటాల పాలయ్యారు .