చాలామందికి కఫం వల్ల దగ్గు కూడా విపరీతంగా వస్తుంది. మరికొందరు.. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. చాలామందికి ఛాతి భారంగా ఉంటుంది.

ఆ కఫాన్ని గొంతులోకి తెచ్చుకుని బయటకు ఉమ్మివేస్తే పర్వాలేదు. కానీ, దాన్ని చాలామంది నోట్లోకి వచ్చిన మింగేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శ్లేష్మం ఒక్కోసారి మేలు కూడా చేస్తుంది. ప్రేగులతో సహా మన అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. కానీ, ఊపిరితీత్తుల్లోని వాయు మార్గానికి మాత్రం ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే.. మన ముక్కులోని రెండు నాసిక కుహరాలు కలిపి 150 చదరపు సెంటీమీటర్లు ఉంటాయి.

వాటి గోడలపై మడతలు ఉంటాయి. మనం పీల్చే గాలిలో 80 శాతం మలినాలు ఇక్కడే పిల్టర్ అవుతాయి. గోడలపై వెంటుకల తరహాలో ఉండే సిలియా మలినాలను అడ్డుకుంటుంది.శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంటుంది. కాబట్టి, ప్రమాదకర దుమ్మూ, దూళి శ్లేష్మానికి అంటుకోవు. శ్లేష్మం నిరంతరం ఉత్పత్తి అవుతుంది.

నిద్రలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మంలో మృతకణాలు, దుమ్ము, శిధిలాలు ఉంటాయి. అది కడుపులోకి వెళ్లిన తర్వాత రీసైక్లింగ్ అవుతుంది. ముక్కు రోజుకు 100 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తులు రోజుకు దాదాపు 50 మిల్లీ లీటర్ల కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి.