ఈమధ్య ఒక విచిత్ర ఘటన దేశాన్ని ఊపేసింది. లక్షల విలువైన బంగారు ఆభరణాలు పట్టుకునేందుకు ఒక ఎలుక పోలీసులకు దారి చూపింది. చెత్తకుప్పల నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎలుక

సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ చిన్న ఎలుక చెత్తకుప్పలోనే ఖరీదైన బంగారాన్ని పట్టించింది. ఈ సంఘటన మహారాష్ట్ర ముంబైలోని ధనుషి ప్రాంతంలో జరిగింది. అసలు చెత్త కుప్పలు అంత బంగారం ఎక్కడిది అంటారా, అక్కడే ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఆ చెత్త కుప్పలోకి బంగారు ఆభరణాలు ఎలా వెళ్లాలి ఏం జరిగింది అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరో కాలనీకి చెందిన సుందరి అనే మహిళ,

తన కుమార్తె వివాహం కోసం రుణం తీసుకునేందుకు 100 గ్రాముల బంగారు ఆభరణాలతో బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒక యాచకురాలు ఆమెకు కనిపించారు, ఆకలితో ఉన్నారనుకొని ఒక కవర్లో ఉన్న వడపావును వారికి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారు. సుందరి తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకోగా వడపావించిన బ్యాగులోని బంగారం ఉన్నట్లు గుర్తి ంచారు.

హుటా హుటిన యాచకురాలు కనిపించిన ప్రాంతానికి ఆవిడ వెళ్లారు, కానీ యాచకురాలు అక్కడ లేకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ తనకిలో చేపట్టారు. పరిసర ప్రాంతాలలో పరిశీలించారు మొత్తం వెతికారు. అప్పటికే ఆ యాచకురాలుఅక్కడి నుండి వెళ్లిపోయినట్టు గుర్తించారు. చివరికి ఎలాగో ఆమెను పట్టుకొని విచారించగా వడపావు ఎండిపోయిందనుకొని, సుందరి ఇచిన కవర్ను చెత్తకుప్పలో పడేసినట్టు తెలిపింది.

అయితే చెత్తకుప్పలు వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బంగారం ఉన్న బ్యాగు కనిపించలేదు, ఎందుకైనా మంచిదని చెత్తకుప్ప సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక ఎలుక ఆ బ్యాగును పట్టుకొని ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వెంబడించారు బంగారం సంచిని తీసుకొని సమీపంలోనే మురికి కాలువలోకి వెళ్ళింది. ఆ ఎలుక వెంటనే అక్కడి నుంచి బంగారం ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు. అనంతరం సుందరి కుటుంబ సభ్యులకు ఆ బంగారం ఉన్న బ్యాగు ని అప్పగించారు. వస్తువు మనదైతే అది ఎక్కడికి పోదు అంటారు పెద్దవాళ్లు సరిగా అలాగే జరిగింది ఈ ఘటన.