జగ్గయ్యపేటలో అమ్మానుష్యం, మానవత్వం మరిచిన తండ్రి, కన్న కూతురిని చూడకుండా దారుణం.. వాతలు తేలేల కొట్టి చిత్రహింసలు.. సపోర్ట్ చేసిన నానమ్మ. తల్లి లేని పిల్ల అనే కనికరం లేదు, అసలు ఏం జరిగిందంటే బిడ్డకు కష్టం వస్తే కన్నతండ్రికే చెప్పుకుంటుంది.

ఎవరైనా కొట్టిన ఏదైనా మాట అన్నా మా నాన్నకు చెబుతాను అంటుంది కూతురు. అలాంటిది తండ్రి ఇలా ప్రవర్తిస్తే.. ఆ తండ్రికి నానమ్మ తోడై ఇంకా చిత్రహింసలు పెడితే, ఆ చిన్నారి పరిస్థితి దా రుణం.. తండ్రి చేతిలో సేఫ్ గా ఉండాల్సిన ఒక బుజ్జాయి భయంతో బిక్కు బిక్కుమంటూ బాత్రూం లో బతుకుతుంది. తల్లి లేని ఆ బిడ్డను అపురూపంగా చూసుకోవలసిన తండ్రి, అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తే, ఆ తండ్రికి దొరకకుండా బాత్రూంలో దాక్కుంది.

చుట్టుపక్కల వాళ్ళు ఆ తండ్రి దాస్టికాన్ని చూసి బిడ్డను కాపాడారు. అసలు ఏం జరిగిందంటే కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఒక తండ్రి తన కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించారు. తల్లి లేని ఆ బిడ్డను చిత్రహింసలు పెట్టారు. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకునేందుకు బిడ్డ అడ్డుగా ఉందని ఉద్దేశంతో, ఆ చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.

రోజు తల్లితో కలిసి చిత్రహింసలు పెట్టాడు. వంటి నిండా వాతలు తేలేలా కొట్టాడు.జగ్గయ్యపేటకు చెందిన నక్కని ప్రవీణ్ కి పెళ్లి అయ్యి ఏడేళ్ల పాప ఉంది. పాప పేరు లోహిత అయితే ప్రవీణ్ భార్య అయితే 5 ఏళ్ల కిందట మరణించింది. దీంతో పాపని ప్రవీన్ తన తల్లి గోవర్ధనమ్మ చూసుకుంటున్నారు. కాగా మొదటి నుంచి ప్రవీణ్ గోవర్ధనమ్మ పాపను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

ఈమధ్య మరీ ఎక్కువయ్యాయి, రోజు చిన్నారిని కొట్టి బాత్రూంలో పడేస్తున్నారు. ఆ ఇద్దరూ ఆ పాప ఇంట్లో ఉందని విషయాన్ని కూడా బయటికి రాకుండా నోట్లో బట్టలు పెట్టి చిత్రహింసలు పెట్టే వారని, స్థానికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.