ప్రస్తుత కాలంలో అడ్వాన్సు టెక్నాలజీ తో పాటు, వాతావరణ కాలుష్యం కూడా అదే స్థాయిలో ఉంది. ఒకవైపు శబ్ద కాలుష్యం, మరో వైపు దుమ్ము, ధూళితో నిండిపోయి ఉన్నాయి. వాటి వల్ల చెవి, ముక్కు లో, కళ్ళు, దుమ్ముతో కొట్టుకుపోతున్నాయి. కళ్ళు, ముక్కు అంటే రోజుకు ఒకసారైనా వాష్ చేస్తూనే ఉంటాం కానీ, చెవి సంగతి ఏంటి? అసలు చెవిలో ఏమేమి జరుగుతాయో తెలుసా..? చెవిలో తయారయ్యే ద్రవాలు పొక్కులు గా మారి అక్కడే స్టాక్ ఉండిపోతాయి. ఇలా ఏర్పడిన దానిని చెవి శుభ్రం చేయడం పై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కొంత మంది రోజుకు ఒకసారైనా చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుతూ ఉంటారు.

చేతికందిన పుల్ల పెన్, పెన్సిల్ ఏదో ఒకటి పెట్టి చెవిలో తిప్పుకుంటూ సుఖంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు ఆడవాళ్లు అయితే చెంప పిన్నులను చక్కగా పెట్టేస్తుంటారు. ఇంకా కొంతమంది ఇయర్బడ్స్ ని బెట్టి చెవిలో తిప్పుకుంటూ స్వర్గం దాకా వెళ్లి వస్తారు. వీళ్లంతా వాళ్ల చెవులు బాగా శుభ్రం చేసుకుంటున్నారు అని బాగా ఫీల్ అయిపోతారు. ముందుగా ఈలాంటి పనులు ఆపాలి. ఈ విషయం మేం చెబుతున్నది కాదు ఏ డాక్టర్ని కలిసి అడిగినా మీకిదే చెప్తారు. కాటన్ ఇయర్బడ్స్ చెవిని శుభ్రం చేయడం వల్ల కర్ణభేరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని వల్ల చెవి లోపలి భాగంలో గాయాలయ్యే ప్రమాదం ఉంది. వినడానికి కాస్త ఫన్నీగా ఉన్నా ఇది నిజం. ఇలా చేయడం వల్ల చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చెవిలో ఏదైనా వస్తువు పెట్టి గుబిలి తీసుకునే సమయంలో అది కర్ణభేరికి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ గుబిలి తీసుకోకుండానే చెవిలో ఉంచుకుంటే ఎలా అంటారా? చెవిలో జరిగే ఓపెన్ రహస్యం ఏమిటంటే గుబిలి చెవిలో ఉండడం మంచిదే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా చీమలు పురుగులు అంటే కీటకాలు చెవిలో దూరకుండా రక్షిస్తుంది. గూబి లూబ్రికేట్ గా పనిచేసే చెవి పొడిగా మారి దురద పెట్టకుండా చూస్తుంది. అయితే ఈ గుబిలి దానంతట అదే బయటికి వెళ్లి లా చెవి నిర్మాణం ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు తినేటప్పుడు ఏదైనా నమిలేటప్పుడు దవడలు కదిలిస్తుంది కదా, ఆ కదలిక వల్ల చెవిలో గుబిలి బయటకు వస్తుంది. మనం చేయాల్సిందల్లా, స్నానం చేశాక టవల్ను మరీ చెవిలోకి దూరకుండా శుభ్రం చేసుకోవడమే. ఇంకొక నిజం ఏమిటంటే, చెవి భాగాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేమిటంటే చెవులు తమలోని భాగాలను..

మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.