అజీర్ణం , కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్లు తాగడమో చేస్తారు.

అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేం దుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమై న పదార్థాలను ఉపయోగించి,

పైన పేర్కొ న్న సమస్యలను ఎలా తగ్గిం చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అసిడిటీ సమస్య బాధిస్తుం టే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా త్వరగా జీర్ణమ వుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు.

జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపో తుం ది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమ వుతాయి.భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుం టే అందుకు లవంగాలు ఉత్తమత్త మైన పరిష్కారం చూపుతాయి. 2 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.

జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొం త తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం , గ్యాస్, అసిడిటీ సమస్యలు తొలగిపోతాయి.అజీర్ణం , గ్యాస్ సమస్యలను తగ్గిం చడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూ న్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుం ది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…