కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అయి చాలామంది తినడానికి ఇష్టపడరు. కాస్త చేదుగా ఉన్న అందులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కాకరకాయ అంటే మొహం మార్చేస్తారు. తినడానికి కూడా ఇష్టపడరు. అయితే కాకరకాయ కాదు అందులో ఉన్న గింజలు కూడా మనకు చాలా మేలు చేస్తాయి. కాకరకాయ లాగానే కాకరకాయ గింజలు కూడా కాస్త చేదుగానే ఉంటాయి.

అలా అని కాకరకాయనే కాదు కాకరకాయ గింజలను కూడా తినని వారు చాలామంది ఉన్నారు. కానీ కాకర గింజలను తినడం వల్ల ఎన్నెన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. కాకరకాయ విత్తనాలను తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు..

హార్ట్ ఎటాక్ కూడా తగ్గుతుంది. ఇక అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే కాకరకాయ విత్తనాల వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మధుమేహం కి కాకరకాయ విత్తనాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగుల్లో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతేకాదు వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.

ఒక రకంగా చెప్పాలంటే డయాబెటిస్ పేషెంట్లకు కాకర విత్తనాలు వారం లాంటివి. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. డయాబెటిస్ రోగులతో పాటుగా గుండె ఆరోగ్యానికి కూడా కాకర విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి.వీటిని తినడం ద్వారా హార్ట్ ఫీట్ గా ఉంటుంది. అంతేకాదు.. ఇవే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచడానికి ఎంతో సహాయపడతాయి.

అంటే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అన్నమాట.. బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గేవారికి కాకర గింజలు ఎంతో సహాయపడతాయి. వీటిని తరచుగా తినడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి ఎంతో సహాయపడతాయి. ఇది కరోనాకాలం కాబట్టి దీని బారిన పడకుండా ఉండటానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. కొందరు కడుపులో తెల్లని చిన్న పురుగులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజుకు రెండు మూడు కాకర గింజలను తింటే కడుపులో ఉండే పురుగులు చనిపోతాయి. ముక్కుదిబ్బడ, కఫం, జలుబు, పడిశం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఐదు గ్రాముల కాకరకాయ గింజలను తీసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి అందులో కాస్త తేనెను మిక్స్ చేసుకుని తింటే ఈసమస్యలు మటుమాయమవుతాయి..