కోతులు పంటలన్నీ పాడు చేయకుండా, దిష్టిబొమ్మలు పెడుతూ ఉంటారు రైతులు. అలానే ఇంట్లో కూడా తిండి గింజలు కరాబు చేయకుండా, దర్వాజలకి జాలీల తలుపులు బిగించుకుంటారు.

పండ్లతోటలు వేసినోళ్లు, కూలిచి ఎవరినైనా కావలి పెట్టుకుంటారు. మరి రోడ్ల పంటి తిరుగుకుంటా చిన్న వ్యాపారాలు చేసే, వాళ్ళు ఏం చేయాలి కోతుల నుండి ఎలా తప్పించుకోవాలి. అదిరిపోయే ఐడియా ఇస్తాడు..

ఏమన్నా ఐడియా నా ఏసిండా అన్న, క్రియేటివిటీ చూస్తుంటే పండ్లు కర్మ కొంచెం సపోర్ట్ ఇవ్వాలి గాని, బండి మీదనే ఫ్రూట్ మార్కెట్ కూడా పెట్టేలా ఉన్నాడు. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకు బండిమీద తిరుగుకుంటా, పండ్ల అమ్ముతాడంట ఈ అన్న.

అయితే ఇదివరకే ఇట్లా ఇనుప జాలి పెట్టకముందు, గుంపుల గుంపులో కోతులే ఎగబడి పనులన్నీ ఎత్తుకుపోయి, ఆగమాగం చేసేటియట. కోతులు పండ్లమ్మ పండ్లు అని మైకేసుకుని వచ్చాడే ఆలస్యం, గిరాకీ కంటే ఫస్ట్ కోతులే వచ్చి సేపులు, సంత్రాలు, జామకాయలు, అంగూరాలు, అన్ని ఎతక పోయేటియట, ఇంకా ఇట్లా కాదని కోతుల దిమ్మ తిరిగి బొమ్మ కనపడే ఖతర్నాక్ ఐడియా చేసిండు.

ఇట్లా సన్నటి ఇనుపజాల తోటి బోన్ లెక్క చేయిపించిండు. కోతులు తింటున్నయ్ అందుకని జాలి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నానని, పండ్ల వ్యాపారి చెప్పాడు. ఇకనుండి కోతులకు బిపి, అన్నకు హ్యాపీ. కానీ చూడు ఏమన్నా తెలివి చూపించండ అన్న, అపాయంలో ఉపాయం వెతుక్కున్నాడు, మంచిగా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్లు, ఎట్లైనా కోతుల బాధ తప్పట్లేదు కాబట్టి, చూసినట్టు వాళ్ళు ఇటువంటి ఐడియా లేస్తే మంచిది కదా.