ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యా త్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది..ఈ దీపోత్సవం.


ఇక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.. దానికదే చూసితీరాల్సిన ఓ మహోజ్వల ఘట్టం . తిరుమల, యాదగిరిగుట్ట
సింహాచలం, భద్రాచలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, స్తి వేములవాడ, బెజవాడలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల
దేవతామూర్తులను చూసి భక్త క్తటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో

ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యా త్మికవేత్తలత్త సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యా త్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. వీటన్నిటినీ మించిన అద్భుతం ..భక్తజనక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దేదీప్యమాన దృశ్యం .. కోటి కాంతులు ఒకేసారి ప్రసరించే దివ్యా నుభవం..

దీప ప్రజ్వలనం. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధల తో నిర్వ హించుకునే ఈ దృశ్యం చూడాలే తప్ప మాటల్లో చెప్పలేం. ”దీపం జ్యో తిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం .. సంధ్యా దీప నమోస్తుతే” అంటారు..’ ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని నమ్మకం .. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, అధ్యా త్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది..

మన సంస్కృ తికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది.. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యం గా 2013 నుంచి భక్తి టీవీ
కోటిదీపోత్సవాన్ని నిర్వ హిస్తూ వస్తుం ది. మొత్తం గా దీపం జ్యో తి పరబ్రహ్మ అనే దివ్యసందేశం ఇవ్వడమే
ధ్యే యంగా సాగే ఈ కోటి దీపోత్సవం ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్,
ఎన్టీఆన్టీ ర్ స్టేడిస్టే యంలో జరుగుతుంది. ఈ కార్తీకర్తీ మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో పాల్గొని.. అపూర్వ సాంస్కృ తిక కదంబాలు.. సప్తహాప్త రతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులు.. మహాదేవునికి మహానీరాజనాలను తిలకించండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..