మోకాళ్ళలో నొప్పులు ,జాయింట్స్ మధ్యలో కట్ కట్ మని శబ్దం వచ్చేవారు ప్రారంభంలోనే జాగ్రత్తలు తీసుకోకుంటుంటే తీవ్రమైన జాయింట్ పెయిన్స్ ,మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు .

నిర్లక్షం చేసే కొద్దీ అవి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి .శరీరంలో వాయు దోషాలు ఉన్నప్పుడు మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోయి మోకాళ్ళ మధ్య శబ్దం వస్తుంది . అలాగే ఎక్కువగా నిల్చుని పనిచేసేవారు ,ఎక్కువగా నడిచేవారు ,బరువులు మోసేవారు ఇలాంటి సమస్యలకు గురవుతూ వుంటారు .

వీటిని మొదట్లోనే తగ్గించుకోవడం వాళ్ళ ఆపరేషన్లు ,మోకాళ్ళ చిప్పల మార్పిడి వంటి తీవ్ర సమస్యలకు గురికాకుండా జాగ్రత్తపడవచు .దాని కోసం మనం ఆహారంలో భాగం చేసుకోవడం వలన లోపలినుండి సమస్యను నివారించుకోవచ్చు . అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో యిపుడు తెలుసుకుందాం .మోకాళ్ళ నొప్పులు పారరంభదశలో ఉన్నవారు రోజు రాత్రి ఒక స్పున్ మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెంతులను నమిలి తినేసి ఆ నీటిని తాగేయాలి .

ఇలా రోజు చేయడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు . అలాగే మోకాళ్ళ మధ్య గుజ్జు పెరుగుదలను గమనించవచ్చు .అలాగే పాలల్లో పసుపు వేసుకొని తాగడం వలన కూడా జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు .పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది .ఇది ఎముకల మధ్య నొప్పులను,వాపులను తగ్గిస్తుంది . పలు శరీరానికి కావలసిన క్యాల్షియంని పూర్తిగా అందించి ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది .అందుకే రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో అరస్పూన్ పసుపు కలిపి తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది .

రుచి కోసం తేనె కలుపుకోవచ్చు . తరువాత చిట్కా వేయించిన సెనగలు మరియు నల్ల బెల్లం ,రోజు గుప్పెడు వేయించిన సెనగలు ,నిమ్మకాయంత నల్లబెల్లం తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ ,క్యాల్షియం వంటివి పుష్కలంగా లభించి జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తాయి . ఇవి ప్రతి రోజు ఇలా తినడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు .ఎముకల మధ్యలో గుజ్జు పెరుగుదలను పెంచుకోవచ్చు . ఇప్పుడు చెప్పిన ఆహార పదార్దాలు తరుచు తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పుల సమస్యను ఇక జీవితంలో రాకుండా అడ్డుకోవచ్చు .