కివీ పండ్ల గురించి కొంత మందికే తెలుసు. అయితే మన దేశంలో కివీ పండ్ల సపోటా పండ్లతో పోలుస్తుంటారు. కానీ ఈ రెండు పండ్ల రుచి మాత్రం వేరుగా ఉంటుంది.

ఇక మన దేశంలో కివీ ఫ్రూట్ కి ఇప్పుడు ఇండియా భారీ మార్కెట్ అయిపోయింది. కానీ కివీ చరిత్రను అలాగే కివీ తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో చూద్దామా. .

ఈ పండు పుట్టింది న్యూజిలాండ్ లో కాదు. ఉత్తర, మధ్య తూర్పు చైనాలో. ఎప్పుడో 12వ శతాబ్దంలో సాంగ్ సామ్రాజ్య కాలంలో ఈ పండును ఉపయోగించేవారు. ఆ తర్వాత ఇందులో ఉన్న పోషకాల వల్ల దీన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. మొదట్లో చైనీయులు దీన్ని మందుల తయారీలో మాత్రమే వాడేవారు.

అక్కడ ఈ పండును చైనా గూస్బెర్రీ, యాంగ్ తావ్ అని పిలుస్తారు. అయితే 20వ శతాబ్దంలో ఈ పండు తొలిసారిగా న్యూజిలాండ్ వెళ్లింది. అంతే… ఆ తర్వాత ఇది ఆ దేశపు పండుగా మారిపోయింది. దీని పేరు కూడా న్యూజిలాండ్ జాతీయ పక్షి అయిన కివీ పక్షి పేరు పెట్టారు. అయితే కివీ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు జరుగుతుంది. విటమిన్ సి తోపాటూ ఇందులో విటమిన్ K, E కూడా ఈ పండులో సంవృద్ధిగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ కివీ పండులో బాగా దొరుకుతాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ బాగా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆస్తమా తగ్గేందుకు కూడా కివీ పండును వాడుతారు.

బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గలనుకునే వారికి కివీ పండు ఒక అద్భుత వరం. దీ నిని తీ సూ కుంటే కడుపు నినినట్లుగా అనిపిస్తుంది. అధిక బరువు తగ్గించడంలో కివీ పండు చాలా సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: కివీ పండు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ శరీరాన్ని రక్షిస్తుంది. గుండె పోటును నివారిస్తుంది: ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాలల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త పోటును నియంత్రిస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది: కివీ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అందువల్ల ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఎంతో దోహదపడుతుంది. మలబద్దకంతో బాధపడేవారు వారానికి ఒక్కసారైనా కివీ పండును తినడం మంచిది. క్యాన్సర్ ను నిరోధిస్తుంది: కివీ కేన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను నివారిస్తుంది. కివీ పండులో ఉండే యాంటీ ఆక్సిడేట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బి.పి ని అదుపులో ఉంచుతాయి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. గర్భిణీ మహిళలు కివీ పండును తీసుకోవడం చాలా మంచిది.