ఈనెల 26వ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి, ఈసారి కృతిక నక్షత్రం మొదలైన దగ్గర నుండి, కార్తీక పౌర్ణమి ఘడియలు మొదలయ్యాయి కాబట్టి, ఈ కార్తీక పౌర్ణమికి మరింత శక్తి పెరిగింది.

మన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏమో, తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తాయని చెబుతున్నాయి. ఆరోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి.

అందునా ఈ అద్భుతమైన పౌర్ణమి కడియలు కార్తీక సోమవారం రోజు కలిసి రావడం వల్ల, ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు, మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పనులు తినవచ్చా, అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహా శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలానే అత్యంత మహా పుణ్యదీపంగా చెప్పుకునే 365 వొత్తుల దీపాన్ని, ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం 100% కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతే కాదు ఈరోజు గొప్పదనం గురించి కూడా విందాం, ఇలా వినడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత మహా పుణ్యం వస్తుంది. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తిది ప్రారంభం వచ్చి, ఈ సంవత్సరం అంటే నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3: 53 నిమిషాలకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 2: 45 నిమిషాల వరకు ఈ కార్తీక పౌర్ణమి కడియాలు ఉన్నాయి. ఇక కృత్తికా నక్షత్రం వచ్చి దాదాపుగా ఈ పౌర్ణమి గడియాలకు కొంచెం ముందుగా. అనగా నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 2:05 ప్రారంభమై నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1: 35 నిమిషాల వరకు ఈ కృత్తికా నక్షత్రం ఉంది.

మనం ఈ సరి గమనించినట్లయితే ఈసారి మనకు పౌర్ణమి గడియాలతోనే, కృతిక నక్షత్రం మొదలై పౌర్ణమి గడియలు మొత్తం కృతిక నక్షత్రం కలిసి ఉంది. చాలామంది కార్తీక పౌర్ణమిని ఈ కృతిక నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటారు. ఈసారి మనకు నవంబర్ 26వ తేదీన రాత్రి పౌర్ణమి ఘడియలు మరియు కృత్తికా నక్షత్రం ఉన్నాయి. ఇలా పురాణాల్లో చెప్పిన విధంగా అంటే రాత్రి కార్తీక పౌర్ణమి ఘడియలు ఉండాలి. కృత్తికా నక్షత్రం ఉండాలి. అలా ఉన్న రోజు కేవలం నవంబర్ 26వ తేదీ ఆదివారం మాత్రమే ఉంది. నవంబర్ 27వ తేదీ సోమవారం కూడా పౌర్ణమి ఘడియలు కృత్తికా నక్షత్రం ఉన్న, రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు లేవు కావున, ఈసారి మనం నవంబర్ 26వ తేదీన మాత్రమే కార్తీక పౌర్ణమిగా జరుపుకోవాలని. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.