డబ్బులు చేతికొచ్చాయి అని ఆనందం ఆ రైతులదే, కొత్త కారు కొన్నామన్నది సంతోషం ఆ తండ్రి కొడుకులది, ఎంతో ఉత్సాహంగా ఎవరి ఇంటికి వారు వెళుతున్నారు.

కానీ వీధి వారిపై పగబట్టింది. వారు వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి, ఈ ప్రమాదంలో రైతులు ముగ్గురు చనిపోగా, వారి కష్టార్జితం 10 లక్షల రూపాయలు బూడిదయ్యాయి. దీంతో మూడు కుటుంబాలు అంతులేని విషాదాలు ,

మరోవైపు కారు కొన్న రోజే ప్రమాదానికి గురై తండ్రీ కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రకాశం జిల్లా వెసల వారి పాలెం మండలంలో చోటుచేసుకుంది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. బోర్లకుంట కి చెందిన సోదరులు చిత్తారు వెంకటేశ్వర్లు, చిత్తారు వెంకట రాములు తో పాటు సచివాలయ ఉద్యోగిగా పని చేస్తూ, తండ్రికి వ్యవసాయంలో సహాయంగా ఉంటున్న వెంకటేశ్వర్ల నాయుడు గుంటూరు మిర్చి యార్టుకు వెళ్లి, తమ పంటను విక్రయించారు.

అక్కడ వచ్చిన పది లక్షల రూపాయలు తీసుకొని ఇంటికి ఎంతో సంతోషంగా రైల్లో తిరిగి పయనమయ్యారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో వాళ్లు దిగాల్సి ఉండగా, మెలకువ రాకపోవడంతో గిద్దలూరులో దిగారు. అదే వారికి శాపంగా మారింది ఇంటికి వెళ్లేందుకు గిద్దలూరు నుంచి బెస్తవారిపేట వరకు ఆటో ఎక్కారు, కాసేపు ఆగితే దిగిపోయేవారు, కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా ఒక కారు దూసుకు వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న వెంకటేశ్వర్లు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు ఆటోలో మంటలు చెలరేగాయి, దీంతో ఆటో నుంచి బయటికి రాలేక వెంకటేశ్వర్లు, వెంకటరాములు సజీవ దహనం అయ్యారు. పంట డబ్బులు 10 లక్షలు కూడా కాళీ బూడిదయ్యాయి. దీంతో ముగ్గురు రైతులు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అవుతున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో, ఆస్పత్రికి తరలించారు మరోవైపు కారు నడుపుతున్న బైరవని గురవయ్య, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలు అవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు విజయవాడలో కొత్త కారు కొని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.