మన భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆలయాలు వాటిలో చేదించలేని రహస్యాలు దాగి ఉన్నాయి. కావున భారతదేశాన్ని పుణ్యక్షేత్రాలతో పుట్టినిల్లుగా కూడా చెప్పుకుంటారు. అయితే మన దేశంలోనే అత్యంత రహస్యాత్మకమైన ఆలయాలలో కామాఖ్య దేవి ఆలయం ఒకటి.

హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా ఒక మహిళ పీరియడ్స్ లోని దేవుడిని ముట్టుకోకూడదు కానీ, కామాఖ్య దేవి ఆలయంలోకి ఎవరైనా వెళ్ళవచ్చు. ఇక్కడ ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఉండవు. అస్సాం రాజధాని గౌహతి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం సతీదేవికి సమర్పితమైనది.

అయితే ఇక్కడ అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటి అంటే, ఈ ఆలయంలో సతీ దేవి శిల విగ్రహానికి కాకుండా దేవి యొక్క యోనికి పూజలు చేస్తారు. అద్భుతమైన చమత్కారంతో నిండి ఉన్న ఈ ఆలయంలో, యోని వంటి ఒక గుండంతో కప్పబడి ఉండి అందులోనుండి ఎల్లప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయట. అసలు ఈ నీళ్లు ఎక్కడినుండి వస్తాయి.

ఎందుకని కామాఖ్య దేవి ఆలయంలో దేవి యొక్క యోని పూజలు చేస్తారు. ఈ కామాఖ్య దేవి ఆలయాన్ని తాంత్రిక మరియు అఘోరాల పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అసలు కామాఖ్య దేవి ఆలయ చరిత్ర ఏంటి అనేటటువంటి విషయాలను ఎప్పుడు మనం తెలుసుకుందాం.కామాఖ్య దేవి ఆలయం అస్సాం రాజధాని గుహటి నుండి 7 మైళ్ళ దూరంలో నీలంచెల పర్వతాలపై కొలువై ఉంది. అయితే 21 శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయం అత్యంత ప్రసిద్ధికెక్కింది.

ఎందుకంటే ఇక్కడ దేవి భగవతి యోనిగుండం ఉంది. సతీదేవి యోని గుండం ఉన్నందున ఈ శక్తి పీఠాన్ని కామాఖ్య దేవి శక్తిపీఠంగా చెప్పుకుంటారు. పౌరాణిక కథ ప్రకారం దక్ష ప్రజాపతి మహా యజ్ఞం చేస్తూ, ముల్లోకాలలో దేవి దేవతలందరిని ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవి మరియు పరమేశ్వరుని మాత్రం పిలవడు కానీ, దక్ష ప్రజా పతి కుమార్తె అయినా సతీదేవి తన తండ్రి పిలవకపోయినా అక్కడికి వెళుతుంది. దాంతో దక్ష ప్రజాపతి సతీదేవిని గోరంగా అవమానిస్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.