చిత్తూరు జిల్లాలో మైనర్ పై దారుణం, కళ్ళు పీకేసి జుట్టు కత్తిరించి హత్య, ప్రేమ పేరుతో వేధించిన వారే ఇలా చేశారని ఆరోపణలు, తల్లిదండ్రులు ఆవేదన. న్యాయం చేయాలని డిమాండ్ చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్టరీగా మారిన భవ్య శ్రీ మృతి కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి .

తమ కూతురుది ముమ్మాటికీ హత్య అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిన ముగ్గురు యువకులు చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. జుట్టు తీసేసి కళ్ళు పీకేసి మరీ దారుణంగా హత్య చేశారని కన్నీరు అయ్యారు. అసలేం జరిగిందంటే.. చిత్తూరు జిల్లా వేణుగోపాల పురానికి చెందిన ముని కృష్ణయ్య పద్మావతి కూతురు భవ్యశ్రీ, భవ్య శ్రీ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.

ఈనెల 17వ తేదీన కాలేజీకి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు భవ్యశ్రీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈనెల 25వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం బావి దగ్గరికి అక్కడ భవ్య మృతదేహం తేలుతూ కనిపించింది.

దీంతో సమాచారం అందుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవ్య శ్రీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్ట్మార్టం రిపోర్టులో తేలింది కానీ, హంతకులు భవ్య రెండు కళ్ళను పీకేశారు ఆమె చక్కటి జుట్టును గుండు గీసేసి బావిలో పడేశారు. దీంతో ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది, అయితే భవ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను చంపేశారని, గ్రామానికి చెందిన ముగ్గురు అబ్బాయిలు ప్రేమ పేరుతో వేధించే వారిని, వాళ్ళే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోస్ట్మార్టం నివేదికలో తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.

కళ్ళు ఎవరు పీకారో జుట్టు ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కూతురు వంటిపై ఉన్న ఆభరణాలను చూసి మృతదేహాన్ని గుర్తుపట్టారు. మునికృష్ణ పద్మావతి దంపతులు ఆమె అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సకాలంలో స్పందించి ఉంటే బ్రతికి ఉండేదని వారు ఆరోపించారు. నిందితలను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై ఎస్సై అనిల్ వివరణ ఇచ్చారు, బావిలో నీటిని బయటికి తోడేసి జుట్టు వచ్చి అప్పుడు జుట్టు వచ్చిందని అన్నారు. అనుమానితులను పిలిచి విచారించామని ఎలాంటి అనుమానాలు లేవని అంటున్నారు. మృతదేహం నుంచి నమోనాలను పరిష్య నిమిత్తం ఫోరెన్సిక్లాబ్ కి పంపినట్లు చెప్పారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.