కలయుగంలో భగవంతుడు ఎవరికీ కనిపిస్తాడు తెలుసా, అదే తెలియాలంటే ఒక కథను వినాలి ఈ కథను వినడం చాలా అదృష్టం. ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ కథని వినగలరు ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియో చూడగలరు. పూర్వం ఒక శివశర్మ అనే యువకుడు ఉండేవాడు, ఆ యువకుడు ఏ పని చేసేవాడు కాదు,

తినడం తిరగడం అంతకుమించి ఏ పని రాదు, పైగా అమాయకుడు ఇంట్లో వారు భరించలేక ఏదైనా ఆశ్రమం చూసుకోమని వెళ్ళమన్నారు. సరేనని ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు, ఒక ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు, ఆహా ఇక్కడ భోజనం బాగా దొరుకుందనుకుంటా బాగా లావుగా ఉన్నారు అనుకున్నాడు. శివశర్మ ఇంతలో గురువు దగ్గరికి శిష్యులు వచ్చారు,

వాళ్లు కూడా లావుగానే ఉన్నారు వాళ్లను చూసి శివశర్మ అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడు పూటలా భోజనం దొరుకుతుంది అనుకొని, గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు, కానీ నాకు మూడు పూటలా భోజనం కావాలి అన్నాడు శివశర్మ, అప్పుడు గురువుగారు నాయనా చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమే ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు శివశర్మ.

సరే అయితే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువగా తిను అన్నారు గురువుగారు, సరేనన్నాడు శివశర్మ అలా శివశర్మ అక్కడ ఉండిపోయాడు. ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా, ఒకసారి ఏకాదశి వచ్చింది. ఈరోజు ఏకాదశి కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉండాలన్నారు గురువుగారు. అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు నేను ఉపవాసం ఉండలేను అన్నారు శివశర్మ. అప్పుడు గురువు సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి వండుకు తిను కావాలంటే సరుకులు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు.

సరేనని సరుకులు తీసుకున్నాడు శివశర్మ, తరువాత గురువు శివశర్మతో నాయనా వండిన ఆహారం ముందు స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే నువ్వు తినాలి సరేనా అన్నాడు. దానికి శివశర్మ అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు కింద వంట చేసుకొని భగవంతుడిని పిలిచాడు. శివశర్మ అమాయకుడు గనుక స్వామికి నైవేద్యం పెడితే ఆ స్వామివారే స్వయంగా వచ్చి తింటాడేమో అనుకున్నాడు. దాంతో శివశర్మ రామ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం తిను అంటూ పిలవడం మొదలుపెట్టాడు. కానీ ఎంతకు స్వామి రాలేదు. ఎంతకు రాకపోయేసరికి శివశర్మ కూడా ఆలోచించి దేవాలయంలో అయితే ప్రసాదాలు నైవేద్యాలు పెడతారు, ఇక్కడ ఏముంది కుదిరి కుదరని వంట తప్ప స్వామీ అక్కడ అయితే బాగా పెడతారని అనుకుంటున్నాడేమో, ఈరోజు ఏకాదశి ఎక్కడ ఏమి ఉండదు ఏమీ పెట్టరు. ఇక్కడకు కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు అని మళ్లీ పిలవడం మొదలుపెట్టాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.