కర్ణాటకలో గనులు భూమిక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న, కేఎస్ ప్రతిమ బెంగళూరులోనే తన అపార్ట్మెంట్లో, దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్త కొడుకు తీర్థహళ్లిలో ఉంటున్నారు. చదువు నిమిత్తం తండ్రి కూడా అక్కడే ఉంటున్నారు.

అయితే ప్రతిమ ఇంతకుముందే సీనియర్ పోస్టుగా, డిప్యూటీ డైరెక్టర్ గా రాంనగర్ జిల్లాలో పనిచేశారు. ఆమె ఎక్కడ పని చేసినా కూడా చాలా డైనమిక్ గా ఉంటారు. అనుమతులు లేని మైండ్స్ ని ఆమె క్లోజ్ చేస్తారు. సోదాల దగ్గర నుంచి నియమితులను జైలుకు పంపే విషయంలో, రాజకీయ నాయకుల ఒత్తిడిని కూడా పట్టించుకోరు.

ఈమధ్య ఆమె భారీగా తనిఖీలు చేసి కొన్ని మైన్స్ ను క్లోజ్ చేసేసారు. ఆ తర్వాతే ఆమె బెంగళూరుకి బదిలీ అయ్యారు అయినా కూడా, బెంగళూరులో తన సత్తా చాటుతున్నారు. ప్రతిమ గోకుల్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా, ఐదేళ్లుగా అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. భర్త పిల్లలు ప్రతివారం వచ్చి వెళుతూ ఉంటారు. అయితే ఎప్పటి మాదిరిగానే విధులు ముగించుకొని, నవంబర్ 4న రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చారు.

ప్రతిమ ఆమె కార్ డ్రైవర్ కార్ నీ పార్కింగ్ ఏరియాలో పార్కు చేసి, కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రతిమ ఇంటికి వెళ్లడం వాచ్మెన్ కూడా చూశాడు. డ్రైవర్ బయటికి వెళ్లిపోయాడు అయితే రాత్రి పది గంటల సమయంలో ఆమె సోదరుడు ఎంత ఫోన్ చేసినా కూడా, సోదరి కాల్ లిఫ్ట్ చేయలేదుపైగా ఆఫీస్ నుండి వస్తూనే, భర్త కొడుకుతో మాట్లాడారు దీంతో వారు పడుకొని ఉంటుందిలే అనుకున్నారు. అలసిపోయి ఇంటికి వస్తూనే భర్త ప్రతిమని ఆ ఇబ్బంది పెట్టడు.

ప్రతిరోజు సాయంత్రం కానీ రాత్రి కానీ కొడుకుతో, వీడియో కాల్ లో మాట్లాడడం ఆమెకు అలవాటు కానీ, సోదరుడు ప్రత్యుత్ మాత్రం ప్రతిరోజు రాత్రి 10 గంటల లోపు కచ్చితంగా ఫోన్ చేస్తాడు. అలా ఆరోజు కూడా కాల్ చేసినా లిఫ్ట్ చేయడంతో కింద అంతస్తులో, తెలిసిన వారికి కాల్ చేశాడు. ప్రతి మా అక్క కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి వెళ్లి చూడమని కోరారు. దీంతో సరేనని వారు వెళ్లి చూడగా డోర్ దగ్గరికి వేసి ఉంది. తలుపు తీయగానే రక్తపు మడుగులో పడి ఉన్న ప్రతిమను చూసి షాక్ అయ్యారు. వెంటనే అతడికి విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉన్నత స్థాయి అధికారి కావడంతో పోలీసు అధికారులు క్రైమ్ సీన్ కి చేరుకొని ఆధారాలు సేకరించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.