కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రైన్డింగ్ అవుతూ సెన్సేషన్ గా మారిపోయింది. దీంతో యూత్ అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడి పోతున్నారు.

ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డు పైన వాహనాలు పార్కు చేస్తున్నారు. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకే తలనొప్పిగా మారింది. ఇంకేముంది ట్రాఫిక్ జామ్ కి కారణం అయిన కుమారి ఆంటీ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీలోని గుడివాడకు చెందిన సాయికుమార్ హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూర్ రోడ్లో 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ని ప్రారంభించారు. తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్ లో కేవలం 5 కేజీల రైస్ తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్, ఇప్పుడు రోజుకి 100 కేజీలు పైగానే అమ్ముడు పోతుందట.

అయితే అక్కడ జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తూ ఉండడం గమనించిన కొందరు, వ్లగర్స్ ఆమెపై వీడియోలు పెట్టడంతో యూట్యూబ్లో ఆమె సంచలనంగా మారింది. ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రెటీలు కూడా వచ్చి ఆ మీ దగ్గర భోజనం చేస్తున్నారంటే, ఆమె ఎంతగా ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు నడుస్తుంది. వెజ్ లో వైట్ రైస్, బగార రైస్, లెమన్ రైస్, టమాటో రైస్, గోంగూర రైస్ బోటి రైస్, జీరారైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్ ఇక నాన్వెజ్ లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ మటన్ ఫ్రై, లివర్ బోటి తలకాయ చాపలు కూడా ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీని ఆంటీ దగ్గర చాలా ఫేమస్. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/I7djKDZY7jo