సంక్రాంతికి కీడు వచ్చిందని అంటున్నారు, అలా ఏమీ రాలేదు ఇది అసత్య ప్రచారం జరుగుతుంది. ఇలాంటివి ఎవరూ కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం అనేది ఈ సంక్రాంతికి రాలేదు.

మకర సంక్రాంతి ఈసారి మనకు స్వస్తిశ్రీ శోభక్రుత్ నామ సంవత్సర పుష్య మాస శుక్ల చతుర్థి సోమవారం పూర్వభద్ర నక్షత్ర యుక్త, మకర లగ్నమందు సూర్యుడు మకర రాశి ప్రవేశంతో, ఉత్తరాన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.

దీనికి సంబంధించి సంవత్సరంలో జరిగే ఫలితాలు ఉంటాయి. కానీ ఇలా కీడు అనేది ఎక్కడ రాలేదు, అలా వచ్చి ఉంటే ముందే పంచాంగం లో ప్రస్తావించి ఉండేవారు. పైగా ఉత్తరాన పుణ్యకాలంలోకి మనం ప్రవేశం చేస్తున్నామంటేనే ఇది మనకు శుభాన్ని కలిగించేది అని అర్థం. అందుకే ప్రజలంతా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు,

ఇద్దరి కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న కన్నతల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు వేయించుకోవడానికి, డబ్బులు ఇవ్వాలి అనేది అసత్య ప్రచారం మాత్రమే, ఇలా అసత్య ప్రచారాలు నమ్మవద్దు. సంక్రాంతికి కీడు అనేది లేదు అది కూడా ఒక్క కొడుకు ఉన్నవారికి తల్లులకి గండం అనేది అసత్యం. ఒక కొడుకు ఉన్న తల్లులు మీరు ఎటువంటి ఆందోళన పడవద్దు.

ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే, మీరు గాజులు వేసుకోవాలి అంటే మీ సొంత డబ్బులతో కొని, పండుగ సందర్భంగా వేసుకోవచ్చు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కీడు వచ్చింది. అందుకే వేసుకోవాలి అనేది అసత్యం. సంక్రాంతి కీడు అని అనుకొని ఇలాంటివి మాత్రం చేయకండి. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మి టెన్షన్ ఎవరు పడవద్దు. మీ బిడ్డకు మీకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, మీకు నచ్చితే పండుగ సందర్భంగా మీరే కొత్త గాజులు వేయించుకోండి. అందులో ఎటువంటి తప్పులేదు కానీ ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.