విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే, సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ యాంకరింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది.

నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగులో మూడు సినిమాలు చేసింది కానీ, అవి పెద్దగా విజయం సాధించలేదు. అనంతరం సినిమాలకి పులిస్టాప్ పెట్టి వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి జరిగింది. ఉదయపూర్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక నిర్వహించారు.

అయితే 2020లో వీరి వివాహం జరగగా, ఆ తర్వాత రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. గత ఏడాది ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నిహారిక చైతన్య తమ వి డాకుల అంశంపై ఎక్కడ స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సినిమాకి ఇచ్చిన యిన్టర్ వ్యూలో విడాకులకు గల కారణాలను వివరించండి. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనుషుల్ని త్వరగా నమ్మకూడదని విషయం, తనకి పెళ్లి తర్వాతనే తెలిసింది అన్నది నిహారిక.

అంతేకాక పెళ్లికి ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడతామని కానీ, వివాహం తర్వాత తప్పుడు వ్యక్తి మీద ఆధారపడితే, జీవితం శూన్యం అవుతుందని చెప్పకు వచ్చింది. అయితే విడాకుల తర్వాత తన కుటుంబం తనకి ఎంతో మద్దతుగా నిలిచిందని, తాను సంతోషంగా ఉండడమే తన కుటుంబానికి ముఖ్యమని చెప్పుకు వచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సంతోషంగా ఉన్నాం అన్నది. నాగబాబు లాంటి తండ్రి దొరకడం తన అదృష్టం అని చెప్పకు వచ్చింది నిహారిక. అంతే కాదు ఇప్పుడు తనకి కేవలం 30 ఏళ్లు అని భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుని అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ వీడియో పై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు నిహారిక గురించి ఎక్కడ ప్రస్తావించకుండా, ఆమెని ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ విజయేంద్ర పై సీరియస్ అయ్యాడు. విడాకులపై పరోక్షంగా తన వైపు గల కారణాలు చెప్పే ప్రయత్నం చేశాడు. చైతన్య హాయ్ నిఖిల్ నిహారిక మీద నెగిటివ్ రాకుండా చేసుకునేందుకు, నువ్వు చేస్తున్న ప్రయత్నం బాగానే ఉంది, కాకపోతే ఆలస్యం అయ్యింది. వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని, నాకు తెలుసు కానీ లేదు కదా మీరు పరోక్షంగా బాధితురాలు అనే టాగ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు మానుకోండి, అని సూచించాడు.

https://youtu.be/5VLhNgocf74

నిఖిల్ ఇలా చేయడం ఇది రెండవసారి అని చెప్పకు వచ్చాడు. చైతన్య విడాకుల విషయంలో బాధ దాని నుండి బయటపడడం అనేది రెండువైపులా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఆ బాధనుండి ఎలా బయటపడ్డామని దాని గురించి మాట్లాడితే, అది జనాలకు ఉపయోగపడుతుంది దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం అనేది, సరైనది కాదు దానిని నేను కూడా అంగీకరిస్తాను. అలా అని ఇలాంటి వేదికల మీద నానానికి ఒక వైపు మాత్రమే చూపించే ప్రయత్నాలు చేయడం కూడా అంతే తప్పు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు. అంటూ నిఖిల్ తన ఇన్స్టాల్ లో పోస్ట్ చేసిన నిహారిక వీడియో ప్రోమో కింద కామెంట్ చేశాడు. చైతన్య జొన్నలగడ్డ ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.