పూర్వం ఒక గురువు తన ఆశ్రమాన్ని ఒక నది ఒడ్డున ఏర్పాటు చేసుకొని, అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివిధ రకాల పద్ధతులలో జ్ఞానాన్ని నేర్పేవారు. ఆశ్రమంలోనే శిష్యులకు వేరే వేరే మార్గాలలో జ్ఞానాన్ని పంచేవారు,

ఒకసారి ఆ ఆశ్రమానికి ఒక మహారాజు తన కుమారుడిని తీసుకువచ్చి, గురుదేవా నా కుమారుణ్ణి మీ ఆశ్రమంలో ఉంచుకొని, అతనికి జ్ఞానాన్ని ప్రసాదించండి నా కుమారున్ని ఒక మహారాజు కొడుకు లాగా భావించకుండా, ఒక సాధారణ పిల్లవాడి గానే భావించి జ్ఞానాన్ని ప్రసాదించండి అని అంటాడు.

అప్పుడు ఆ గురువు మహారాజా మీరేమీ భయపడకండి, మీ కుమారుడ్ని ఒక సాధారణ వ్యక్తి లాగే భావించి అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, ఇక మీ కుమారుడి బాధ్యత పూర్తిగా నాదే అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని, గురువుగారు ఆ నది ఒడ్డుకు వెళ్లిపోయారు ఆశ్రమంలోని మిగతా శిష్యులు ఆ మహారాజును చూసి అందరూ బాగా చూడండి. ఈ మహారాజు తన కుమారుడిని రథంలో తీసుకువచ్చాడు,

ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు మహారాజు కొడుకు అతడితో మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమగా ఉండాలి అతడికి మర్యాదను ఇవ్వాలి అని అనుకుంటారు. ఇక గురువుగారు ఆ రాజకుమారుడిని నదీబడ్డకు తీసుకువెళ్లగానే, ఆ పిల్లవాడు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే అంత చిన్న పిల్లవాడిని తన తండ్రి ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడని తలుచుకొని బాధపడుతున్నాడు. అతడికి అర్థం కావడం లేదు తన తండ్రి తన మంచి కోసమే ఇక్కడ వదిలి వెళ్లిపోయాడని,

ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసినా గురువుగారు అతడితో ఇలా అంటున్నారు. నాయనా నేను నిన్ను ఏడవ వద్దు అని చెప్పను, ఈరోజు నేను నిన్ను ఓదార్చిన రేపు మళ్లీ నువ్వు నీ వాళ్లను తలుచుకొని ఏడుస్తావు, నాయనా బాగా గుర్తుంచుకో ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగానే వస్తాడు. ఒంటరిగానే వెళ్ళిపోతాడు ఎంత తొందరగా మానవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో, అతడు అంత తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉండడం నేర్చుకుంటాడు,

అతడు తనను తాను ప్రేమించుకుంటాడు తనను తాను ప్రేమించుకున్న వాడు, ఇక ఎవరూ తనని వదిలి వెళ్ళిన ఏమాత్రం పట్టించుకోడు. నాయనా నువ్వు మెల్లిమెల్లిగా ఈ ఆశ్రమంలోని వాతావరణంలో కలిసిపోతావు, మొదట్లో కొన్ని రోజులు నీకు సమస్య కలుగుతుంది కానీ కొన్ని రోజులకు నీకు బాగా అలవాటైపోతుంది. ఇక ఆ తర్వాత నీకు ఈ ఆశ్రమమే అన్నింటికంటే గొప్పగా అనిపిస్తుంది. ఇది నీకు నీ రాజభవనం లాగా అనిపిస్తుంది అని అంటాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.