2024 లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవబోతోంది, బ్రహ్మ గత ప్రళయం పూర్తి అయ్యిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు.

ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది ఉగాదిని యుగానికి నాదిగా ప్రారంభ సమయం గా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణిస్తాము.

ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది, ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు, ఈ ఉగాది పండుగ తెలుగు వారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు.

తెలుగువారుఎక్కువగా ఉపయోగించే, చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాదినాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు.

జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. రుతుమున కుసుమాంకరం అనే భగవానుడు స్వయంగా తానే వసంత రుతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత రుతువులో తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువులకన్నా విశేషమైన రుతువు వసంత రుతువు, ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పోయు వసంత రుతువులు నేనే అని తన ముఖ్య విభూతులు చెబుతూ భవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…