ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు,

ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. మరి ఇలా జ్ఞాపక అర్థం గా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా?

ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది. ఈ సందేహాలు అన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మరణిస్తే 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ చేస్తారు. అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు.

వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్లడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి. దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు,

కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. దినం భోజనాలకు పితృదేవతా ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్లాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన 13, 14 రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.