మన భారతదేశంలో పాముల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే పాములు చూడగానే భయపడే వారు చాలా మంది ఉన్నారు.

అలాగే పాముల కోరలు పీకి, రోడ్లపై ఆడించి జీవనం సాగించే వారు ఉన్నారు. అంతే కాదండి పాములు చూడగానే చేతులు జోడించి దండం పెట్టే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన హిందూ సంప్రదాయాల్లో నాగు పామును దైవంగా భావిస్తారు నాగ పంచమి రోజు చాలా పెద్ద పండుగ చేసుకుంటాం.

మన హిందూ పురాణాల ప్రకారం ఎంతో మహిమగల నాగరాజు ఉన్నట్లు అవి ఎంతో పవిత్రమైన, విలువైన నాగమణి ని కలిగి ఉంటాయని అంతేకాదు అవి ఇష్టరూప ధారులుగా మారతాయని మన పురాణాల ప్రతీక. ఇవి వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉంటాయని మన పూర్వీకుల నుండి వింటూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ నాగరాజులు ఉన్నాయ్ అని చెప్పగలను.

కేరళ రాష్ట్రంలో ప్రాజామ్ గాడి అనే గ్రామంలో పాములను సుబ్రమణ్య స్వామి గా కొలుస్తారు అక్కడి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దైవానికి సంబంధించిన గుప్తనిధులు ఉన్నాయని వాటిని ఇటువంటి నాగరాజు కాపాడుతున్నాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇంతకీ మనం చెప్పుకునే కథకు ఈ నాగరాజుల సంబంధం ఏంటి? అసలు సంఘటన చూస్తే ఒక స్త్రీ, ఒక పాము తో సంసారం చేసిందట అంతేకాదు ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా, అసలు ఒక స్త్రీ పాము తో సంసారం చేయడం ఏంటి? అందులోనూ ఓ బిడ్డకు జన్మనివ్వడం ఏమిటి? ఇదంతా వినడానికి వింతగా ఉంది కదూ? మరి ఆ భగవంతుని ద్వారా సాధ్యమైంది. ఇది ఎంతవరకు నిజం? వివరాల్లోకి వెళితే రెండు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ యదార్థ సంఘటన.

షల్గార్ అనే గ్రామంలో అప్పన్న అనే రైతు ఉండేవాడు. చాలా మంచివాడు, ఎవరికీ హాని చేసే వాడు కాదు కానీ అతనికి ఉన్న ఒక చెడ్డ అలవాటు వేశ్యలతో వెళ్ళేవాడు. అప్పన్న తల్లిదండ్రులు అతడికి రాణి అనే అమ్మాయితో పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు మొదట్లో అప్పన్న పెళ్ళికి ఒప్పుకునేవారు కాదు కానీ ఇంట్లో ఒత్తిడివల్ల అంగీకరించవలసి వచ్చింది. రాణి తల్లిదండ్రులకు అప్పన్నకు వేశ్యల పిచ్చి వున్నట్లు తెలియకుండానే ఇద్దరికీ పెళ్లి చేశారు. అప్పన్న, రాణి ఇద్దరు వేరే ఒక ఇంట్లో కాపురం పెట్టారు. అప్పన్నకున్న వేశ్యల పిచ్చితో రాత్రులు బైటికివెళ్ళిపోయాడు, అంతే కాదు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు రాణి లోపల పెట్టి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. రాణి తన ఆవేదన ఎవరితోనూ చెప్పలేక తనలో తానే దుఃఖిస్తూ ఉండేది.