ప్రతి ఒక్కరు కూడా నిద్రించే ముందు, నిద్ర లేచిన తర్వాత, ఏ పనులు కచ్చితంగా చేసే దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందో, ఇప్పుడు మనం చూద్దాం, ఎవరైనా సరే నిద్రపోయేముందు, తడి కాళ్ళతో నిద్రపోకూడదు, ఆ నియమం తప్పకుండా పాటించాలి, కాళ్ళు కడుక్కున్న తర్వాత, కాళ్ళు పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత, మాత్రమే నిద్ర పోవాలి, అలాగే ఉదయం నిద్ర లేవగానే, ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు చూడకూడదు, చెత్త బుట్ట చూడకూడదు, ఉదయం నిద్ర లేవగానే, చెప్పులు చూసిన, చెత్తబుట్ట చూసిన, దరిద్ర దేవత తాండవిస్తుంది, అదృష్టం అనేది తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, అలాగే ఉదయం నిద్ర లేవగానే అర చేతిల చూస్కోవాలి.

అంతేగాని ఎదుటి వాళ్ల పాదాలు చూడకూడదు, ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే పొరపాటున, ఎదుటి వాళ్ల పాదాలను చూశారు అనుకోండి, అదృష్టం తగ్గిపోతుంది, అలా చూడకూడదు, అలాగే ఉదయం నిద్రలేవగానే, ఆకాశం వైపు కూడా చూడకూడదు, మన రెండు అరచేతులు మాత్రమే చూసుకోవాలి, ఉదయం నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న, స్త్రీ లను ఎవరో చూడకూడదు, అలా చూస్తే కుటుంబ కలహాలు పెరుగుతాయి, ఉదయం నిద్ర లేవగానే గొడవపడే వాళ్ళని, ఎట్టిపరిస్థితుల్లో చూడకూడదు, ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకోండి, ఉదయం నిద్ర లేస్తూనే వాళ్ళను చూస్తే, మనకు రోజంతా ఏదో ఒక రకంగా గొడవలు, అవుతూనే ఉంటాయి.

ఉదయం నిద్ర లేవగానే గొడుగును కూడా ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు, గొడుగును చూసాడనుకోండి, మన పనులన్నీ నెమ్మదిగా ఉంటాయి, ఉదయం నిద్ర లేవగానే, ఎట్టిపరిస్థితుల్లో వీటిని చూడకూడదు, మరి వీటిని చూడాలి అంటే, ఉదయం నిద్ర లేవగానే, గోవు వెనక భాగాన్ని చూస్తే, చాలా మంచిది, గోవు తోక చూస్తే మంచిది, సన్యాసులు ని చూస్తే మంచిది, సముద్రం చూస్తే మంచిది, అగ్ని చూస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే నిప్పు ను చూస్తే చాలా మంచిది, అలాగే సంధ్యావందనం చేసుకున్న బ్రాహ్మణుని, ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. వీళ్లు అందుబాటులో లేరు అనుకోండి, మన ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలు ఉంటాయి.

వాటిని ఉదయం నిద్ర లేవగానే విశేషంగా లక్ష్మీకటాక్షం కలుగుతుంది, వాటిలో ముఖ్యమైనది పెరుగు, ఉదయం నిద్రలేవగానే పెరుగుని చూసాడనుకోండి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఆయుష్షు బాగా ఉండాలంటే, నిండు నూరేళ్ళు జీవించాలని అంటే, ఉదయం నిద్ర లేవగానే ఏమి చూడాలి, నెయ్యి ని చూడాలి, నెయ్యి చూస్తే ఉదయం నిద్ర లేవగానే ఆయుష్షు బాగుంటుంది, పెరుగు చూస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది, అలాగే ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే ,కూడా విశేషంగా ధనలాభం కలుగుతుంది, అదేవిధంగా ఉదయం నిద్రలేవగానే, గోరోజనం అని ఉంటుంది, ఆ గోరోజనం చూస్తే చాలా మంచిది.

మారేడు దళం చూసిన చాలా మంచిది, ఉదయం నిద్రలేవగానే పూలు చూస్తే కూడా అద్భుతమైన శుభయోగం కలుగుతోంది, అసలు ఉదయం నిద్రలేవగానే మీరు తెల్ల ఆవాలను తాకిన, గోరోజనం తాకిన మారేడు దళం పట్టుకున్న, పూలు పట్టుకున్న, విశేషంగా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కాబట్టి వీటిని చూసిన తాకిన, ఉదయం నిద్ర లేవగానే విశేషంగా శుభం కలుగుతుంది…