ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి.

అదనంగా, అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మనల్ని రిలాక్స్‌గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి అల్పాహారానికి ముందు అరటిపండు తింటే మంచిదంటున్నారు నిపుణులు.

ఖర్జూరం మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీటుగా చెప్పవచ్చు. సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఖనిజాలు, విటమిన్లు A, B1, B2, C సమృద్ధిగా ఉంటాయి.

మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విట‌మిన్ ఎ, బి,సి, ఇ, కె, కాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ వంటి పోష‌కాలు ఆపిల్స్‌లో పుష్కలంగా లభిస్తాయి.

ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో యాపిల్‌ను తింటే ఎక్కువ‌ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే విట‌మిన్ `సి` ని శ‌రీరం త్వర‌గా గ్రహిస్తుంది. రోగ నిరోధ‌క వ్యవ‌స్థ బ‌ల‌ప‌డుతుంది. అధిక ర‌క్తపోటుతో బాధ ప‌డే వారు ఖాళీ క‌డుపుతో ఆపిల్‌ తింటే చాలా మేల‌ని అంటున్నారు. గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గుతుంది. అంతేకాదు, ఖాళీ క‌డుపుతో యాపిల్‌ను తింటే మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య దూరం అవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి.