ఖాళీ కడుపుతో ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే చాలా మంచిది. ఈ మాట మనం చాలా సార్లు విని ఉంటాం, పెద్దలు మనకి ఎప్పుడూ చెప్పే ఆరోగ్య సూత్రాలలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి మించినటువంటి మహా వరం ఇంకొకటి లేదు, అనేది అర్థం అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం వైపుగా అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటున్న టువంటి ఈ రోజులలో ఆరోగ్యానికి సంబంధించిన అటువంటి కొన్ని చిట్కాలను మీకు మేము అందిస్తున్నాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా..? ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి మన శరీరం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది, ఇందులో 90 శాతం పనుల గురించి మనకు తెలియనివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది మన శరీరం లోపల జరిగే ప్రక్రియ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలో రక్తాన్ని తయారు చేయడం, అలాగే శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలను బయటకు తీయడం లాంటివి. ఇలాంటి ప్రక్రియను దాదాపుగా ప్రతి క్షణం మన శరీరంలో నడుస్తూనే ఉంటాయి. మనం నిద్రిస్తూ ఉండేటప్పుడు కూడా మన శరీరం లోపల్నుండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ జరగడానికి నీళ్లు అవసరం కూడా అంతే ఉంటుంది.

ఎలాగైతే కారు నడపడానికి పెట్రోల్ అవసరం ఉంటుందో ఆ విధంగా అన్నమాట. ఎందుకంటే మన శరీరం 65 శాతం నీటి తో తయారు చేయబడి ఉంటుంది. మనిషి యొక్క చిన్న పెద్ద అన్ని శరీర అవయవాలు నీటితో కలిసి తయారు చేయబడి ఉంటాయి, ఇందువల్లనే శరీరంలో నీటిశాతం ఉండడం సరిగ్గా ఎంతో అవసరం. ఇది లేకుంటే మన శరీరం యొక్క భాగాలు లోపల జరిగే శరీర ప్రక్రియలు ఇంజన్ లేని కారు తో సమానం గా అవుతాయి. సో ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది కదా మన శరీరానికి నీరు ఎంత అవసరమో. నీటిని వేడి చేయడం వల్ల ఇందులో ఉన్న అశుద్ధం మరియు హానికారక సూక్ష్మక్రిములు అన్ని నాశనం అవుతాయి. అలాగే ఈ నీళ్లు మినరల్ వాటర్ కంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి, ఎందుకంటే వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాటర్ లోపల ఉండే కొన్ని అవసరమైన మినరల్స్ ను కూడా నాశనం చేస్తుంది. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.