మునగ అనే పేరు వినగానే గుర్తొచ్చే ది సాంబారులో జుర్రుకునే మునక్కా డల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్ప వృక్షం.

భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ, సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ, పిల్లల కు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్గా ఇస్తున్నాయి.

మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిం దనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు. వందలు వేలు ఖర్చు పెట్టినట్టి నయం కానీ రోగాలను మునగ ఆకు రసం నయం చేస్తుం ది. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తిం చి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోం ది.దాంతో మనదృష్టీ అటు మళ్లిం ది.అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యా న్ని కొనియాడుతున్నారు.ఏముంది మునగాకులో..

మునగ చెట్లనుట్ల పెంచి, ఆకాయల్ని రోజూ తినేవాడట. ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు… మొత్తం గా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ…పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యా సాలూ రాశాడు క్యాస్ట్రో . మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చిం ది. టైమ్ మ్యాగజైన్ ‘ద నెక్స్ట్ క్వినోవాగా’ అభివర్ణిం చింది. దాంతో పాశ్చా త్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూ తీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెం ప్లి ట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.ఎందుకంటే…

100 గ్రాముల .ఎండిన ఆకుల్లో… పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం , అరటిపండ్లలో కన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోట్ల కన్నా 10 రెట్లు విటమిన్-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్… ఇలా చాలా లభిస్తాయి.మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారుకాదు. కాలం
మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు.