క్రోధి నామ సంవత్సర ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024వ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశరాశులలో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది.

ఎప్పుడైనా సరే దేవ గురువైన బృహస్పతి యోగిస్తే, ఏ రాశికైనా రాజయోగం పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురు బలం ఉంటే, ఆ గురు బలం వల్ల అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి గురు బలాన్ని ప్రమాణంగా తీసుకుంటే 2024వ సంవత్సరం మే 1వ తేదీ నుంచి గురు గ్రహ సంచారంలో మార్పు వస్తుంది.

మే ఒకటవ తేదీ దేవ గురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, ఇలా దేవ గురువైన గృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అయిదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టపోతుంది. ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టపోతున్నటువంటి ఐదు రాశులలో మొట్టమొదటి రాసి

మేషరాశి:- ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు వాక్ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు, కుటుంబ స్థానాల్లో గురు సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే 1వ తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధన లాభం ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు,

మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనమన్నట్లుగా ఉంటుంది. కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి వడిదొడుకులు ఉండవు, కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత, మే ఒకటి నుండి రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.