జామపండులో అన్ని పండ్ల కంటే విటమిన్-సి అధికంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు కానీ, ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే జామకాయను మాత్రం, ఈ మూడు వ్యాధులు ఉన్నవారు, అసలు తినకూడదు, ఏ మూడు వ్యాధులు ఉన్నవారు, జామకాయలు తినకూడదో ఇప్పుడు చూద్దాం, జామ పండులో ఉండే విటమిన్ సి, అనేది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జామ ఏడాది పొడవునా లభించిన, శీతాకాలంలో వీటి రుచి భలే ఉంటుంది, జామ లో కమలా పండు లో కంటే విటమిన్ సి లభిస్తుంది.

ఆకుకూరల్లో లభించే పీచు కంటే, రెండింతలు అధికంగా పీచు జామ లో లభిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే, కొలాజెన్ ఉత్పత్తికి ఇది కీలకం, కొవ్వు మెటబాలిజం ని ప్రభావితం చేసే, పెక్టిన్ జామ లో లభిస్తుంది, జామకాయ కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో, సహకరిస్తుంది, జామ లో కొవ్వు కేలరీలు తక్కువగా ఉంటాయి, కావున బరువు తగ్గాలనుకునే వారికి ,ఇది మంచి ఔషధం, జామలో ఉండే పీచు పదార్ధం వల్ల, మలబద్ధకం తగ్గుతుంది. మలవిసర్జన సాఫీగా అవుతుంది, బొప్పాయి, ఆపిల్, నేరేడుపండు, లో కంటే జామ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

జామ పండులో ప్రోటీన్ పీచుపదార్థం విటమిన్ సి, ఫాస్పరస్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, దండిగా ఉంటాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, జామల ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూడు వ్యాధులు ఉన్నవారు తప్ప, ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చు కానీ, ఈ మూడు వ్యాధులు ఉన్నవారు మాత్రం జామను తినకపోవడమే మేలు, అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా గ్యాస్ సమస్య, ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు, అలాంటివారు జామను తినకపోవడమే మంచిది.

జామపండులో విటమిన్ c ఫ్రక్త్రోజ్ ఉంటాయి. ఈ రెండు ఎక్కువగా తీసుకోవడం వలన, ఈ సమస్య ఉన్న వారికి, కడుపు ఉబ్బరం వస్తుంది, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు, జామ ను తినకుండా ఉండాలి, జామ లో 40 శాతం ఫ్రక్త్రోజ్ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా గ్రహించబడుతుంది. దీని కారణంగా ఈ సమస్య ఇంకా పెరగవచ్చు, అదేవిధంగా నిద్రపోయేముందు, జామకాయను తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. అలాగే పేగు సిండ్రోమ్ తో బాధపడుతున్న వారు, కూడా జామ తినకపోవడమే మంచిది..