ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి, హీరోయిన్ అవ్వాలని కోటి ఆశలతో ఇండస్ట్రీకి వచ్చింది .అనుకొని సాధించి రెండు సంవత్సరాల పాటు తిరుగులేని హీరోయిన్గా ఎదిగింది. కానీ ఇంతలోనే ముగ్గురు కామాంధుల చేతిలో ఇలా బలైపోయింది.

ఇంత జరిగినా సరే ఆ కామాంధులు మాత్రం శిక్ష పడకుండా, ఈ కేసు నుండి ఎలా తప్పించుకున్నారు. తన ఒక్కదాని ఒక కూతురికి న్యాయం జరగాలని, 20 ఏళ్లుగా ఈ అమ్మ చేస్తున్న ఒంటరి పోరాటం. ఏంటి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను.

1998 ఆగస్టు 25న తెలంగాణలోని భువనగిరిలో గల ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది .ప్రత్యూష ఈమె తండ్రి సిండికేట్ బ్యాంకులో క్లర్క్ గా పని చేసేవాడు, ప్రత్యూషకి 18 నెలల వయసు ఉన్నప్పుడు తల్లి సరోజినీ దేవి గారు, ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. అలా వేరు హైదరాబాదులోనే తార్నాకలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని, తమ పిల్లల్ని పోషించుకుంటూ జీవించేవారు. కానీ ప్రత్యూష సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు.

దాంతో కుటుంబ బాధ్యత మొత్తం సరోజినీ దేవి గారిపై పడింది. అలా ఆమె ప్రత్యూషన్ని 10 పూర్తికాగానే హిమాయత్ నగర్ లోని, గౌతమి రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇది ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఇక్కడే ప్రత్యూషకే, తన క్లాస్మేట్ అయినా సిద్ధార్థ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొన్నాళ్లకు ప్రేమగా మారింది ఇదిలా ఉండగా, జెమినీ టీవీ వారు కండెక్ట్ చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి ప్రోగ్రాం కి ప్రత్యూష ఫ్రెండ్స్ ఫొటోస్ పంపిస్తున్నారు.

ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ సెలెక్ట్ అయిన వారిని, సినిమా డైరెక్టర్ కి సజెస్ట్ చేసేవారు. తన ఫ్రెండ్స్ కోరిక మేరకు ప్రత్యూష కూడా తన ఫొటోస్ ని పంపించింది. అందం అభినయం అమాయకత్వం కలగలిసిన ప్రత్యూష ఈ ప్రోగ్రాం కి సెలెక్ట్ అయింది. అలా రాఘవేంద్ర రావు గారి అభ్యర్థనకు బొట్ల శ్రీరాములు గారు ప్రత్యూష కి యాక్టింగ్ లోను మరియు, రాకేష్ మాస్టర్ గారు డాన్సింగ్ లోను ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇలా ట్రైనింగ్ తీసుకోవడానికి, ప్రతి రోజు ఉదయం ప్రత్యూష తార్నాక నుండి జిమ్మీ స్టూడియోకి ఆటోలో వెళ్లి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేది. ఈ సమయంలోనే సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష కి మరింత దగ్గరయ్యాడు. కొన్నిసార్లు సిద్ధార్థ ప్రత్యూషని స్టూడియో దగ్గర పికప్ చేసుకుని కాలేజీకి తీసుకు వెళ్లేవాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.