మనందరం వంటలు వండుకునేటప్పుడు, ఫ్రై గా లేదా ఆకుకూరల పప్పు, గ్రేవీ కర్రీలు వండుకుంటూ ఉంటాం పులుసులు వండుకుంటాం. ఈ గ్రేవీ కర్రీలకు చాలామంది నీళ్లు పోస్తూ ఉంటారు,

లేదా పాలు పోస్తూ ఉంటారు గ్రేవీ రావడానికి ఈ పాలు పోస్తే మరి చెప్పదనం వస్తుంది, ఆ చప్పదనాన్ని కవర్ చేయడానికి ఉప్పు ఎక్కువగా వేయాలి, మసాలా ఎక్కువగా వేయాలి కారం ఎక్కువగా వేయాలి. కాబట్టి ఇవన్నీ నీళ్లు పోసి గ్రేవీలు తెప్పించడం వల్ల ఎక్కువ ఉప్పు కారం మసాలాలు పడతాయి.

ఇది ఎక్కువగా లోపలికి వెళ్లడం వల్ల నష్టం జరుగుతుంది, కాబట్టి నీరు పోసి గ్రేవీలు తెచ్చుకునే కంటే, వంటల్లో అలాగే మామూలు గేదె పాలు ఆవు పాలు పోసి వంటల్లో గ్రేవీ తెచ్చుకునే కంటే, ఇంకా మంచి గ్రేవీ నిచ్చేవి హెల్తీగా టేస్టీగా మంచి బలాన్ని ఇచ్చేవి ఒక మూడు రకాలైన నాలుగు రకాలైన హెల్తీ గ్రేవీలని తెలియజేస్తాను.

మీ ఇంట్లో ఈ నాలుగు రకాలు ప్రతినీత్యం ఉంచుకొని ఏ వంటలోనైనా గ్రేవీ కోసం వీటిని వాడండి. టేస్టీగా చాలా బాగుంటాయి ఆ గ్రేవీలకి మీరు తప్పనిసరిగా వాడుకోవాల్సింది, పుచ్చగింజల పప్పుల గ్రేవీ ఇది మార్కెట్లో పుచ్చ గింజల పప్పు బాగా లభిస్తుంది. తక్కువ రేట్ లోనే ఉంటాయి సుమారు 300 నుండి 350 రూపాయలు కేజీ ఉంటాయి.

దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది మంచి రుచి అందుకే స్వీట్ ల మీద అద్దడానికి, ఈ పుచ్చ గింజల పప్పు ద్వారా వేపించి బిస్కెట్స్ మీద అన్నిటి మీద పెడుతూ ఉంటారు. అంత టేస్టీవీ కాబట్టి పుచ్చగింజల పప్పుని ప్రతి ఇంట్లో గ్రేవీగా వాడుకోండి వీటిని గ్రైండ్ చేసి గ్రేవీ తయారు చేస్తే పోయాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.