చాలామంది ఇష్టంగా తినే పండ్లలలో ఆల్ బుకరా పండు ఒకటి. ఎక్కడ కనిపించినా దీనిని వదలకండి.. ఎందుకంటే దీనిలో ఎన్నో మంచి ఔషధ గుణాలు మరి ఆ ఔషధ గుణాలు ఏంటో మనం తెలుసుకుందాం..

ఈ పండులో సోడియం, పొటాషియం సెలీనియం, వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండ్ల లో ఉండే విటమిన్ ఏ, పోలేట్, విటమిన్ కె, విటమిన్ బి1 మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ కాల్షియం, ఫ్లోరైడ్, పొటాషియం అంటే అనేక పోషకాలు కూడా ఉంటాయి.

అలాగే ఈ పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు ఉత్తమైన ఆహారం అని చెప్పవచ్చు.. ఈ పండుగ రోజు తినడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సన్నగా నాజూగ్గా మారుతారు.

ఆల్బుకరా పండు లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మలబద్ధకం అన్నది ఉండదు. అలాగే జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా శుభ్రం అవుతుంది. దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి బీటా కెరటం అధికంగా ఉంటాయి.

కనుక ఈ పండ్లను తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే కేరటయిన్ జియాజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటిపోరులను రక్షిస్తాయి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నుంచి కూడా రక్షణ లభిస్తుంది.