2024 ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి రాబోతుంది. దీనినే మహా మహి అని అంటారు. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తిక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది.

శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని, ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా కాదు. మాఘ మాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేలలో

నదిలోగానే చెరువులో గాని, కోనేరులో గాని చేసే స్నానం వలన గంగా నదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జతకపాల వలన ఎంతటి పుణ్యఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు.

మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి, సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి అటు శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా, శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి,

అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని, సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజు తో చెప్పినట్లుగా తెలుస్తోంది. స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధలనుంచి విముక్తి కలుగుతుంది. పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలో ఒక ప్రాప్తి కలుగుతుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ, ఈరోజు పద్మాలతో అర్చించాలి. మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…