ఈరోజు మనం జుట్టును పొడవుగా, ఒత్తుగా మార్చే, నెంబర్ వన్ హెయిర్ ఆయిల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆయిల్ పల్చగా మారినా, వెంట్రుకలను తిరిగి ఒత్తుగా, తిక్గా మారుస్తోంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, బాగా సహాయపడుతుంది, ఈ చిట్కాను మనం మన ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు, ఈ ఆయిల్ ని మీ జుట్టుకి వారానికి, ఒకటి రెండు సార్లు రాస్తే చాలు, మీ జుట్టు తిరిగి ఒత్తుగా, పొడవుగా, పెరుగుతుంది. అయితే ముందుగా ఆయిల్ ని ఎలా తయారు చేయాలో, ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గిన్నెలోకి కొబ్బరినూనెను తీసుకోవాలి, ఇప్పుడు ఈ గిన్నెను సన్నని మంటపై వేడి చేయాలి, ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతులను వేయాలి, మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు ఒత్తుగా ,పొడవుగా మార్చడంలో, బాగా పనిచేస్తాయి, ఆ తరువాత కొన్ని కరివేపాకుల్లి వేయాలి, కరివేపాకు జుట్టుకు మంచి పోషకాలను అందించి, జుట్టును బలంగా ఒత్తుగా మారుస్తుంది, ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ కాస్టర్ ఆయిల్ వేయాలి, కాస్టర్ ఆయిల్ జుట్టును ఒత్తుగా, పొడవుగా మార్చేందుకు బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఆయిల్ ని మనం సన్నని మంటపై, వేడి చేసుకోవాలి. ఈ పదార్థాల్లో ఉండే పోషకాలు, ఆయిల్లో కలిసిపోయి, అంతవరకు వేడి చేయాలి, ఆ తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి, ఇలా ఈ విధంగా ఆయిల్ ని తయారు చేసుకోవాలి, ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత, వడగట్టి స్టోర్ చేసుకోవాలి, ఇలా తయారు చేసిన ఆయిల్, ఒకటి నుండి, రెండు నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.

ఈ ఆయిల్ ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం, జుట్టు కుదుళ్లకు మాడుకు బాగా పట్టేటట్లు, ఈ ఆయిల్ ను అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి, ఎలా ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డే షాంపుతో తలస్నానం చేయాలి..