వీటిని పనికిరాని కాయలుగా చాలామంది భావించారు.వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాయ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ దీనిలోని పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.

బుడమ కాయలను నేరుగా కూడా తినవచ్చు. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఇందులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, ఐరన్, ఫైబర్, జింక్, ఫాస్ఫరస్, ఫోలిక్ వంటి విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బుడమకాయల‌ను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు.

బుడమకాయల‌తో పప్పు, ఆవకాయ, కూర, పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి.బుడమకాయలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమకాయల‌లో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.

అధిక బరువును తగ్గించడానికి సహాయపడ‌తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండ‌డం వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడ‌తాయి. అలాగే శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తుల‌ను ప్రోత్సహిస్తాయి.

అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి, రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడ‌తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండ‌డం వలన సన్నని గీతలు, ముడతలు, మచ్చలు, రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి, రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇలా బుడ‌మ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.