అల్లోపతి మందుల కంటే అన్ని రకాల ఆయుర్వేద మందుల తోనే చాలా రకాల ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద మొత్తం కూడా మన చుట్టు పక్కన ఉండే కొన్ని మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు ఔషధాల చెట్లు అనేవి మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల ‘ఘనీ’ అయినా ఈ చెట్టు గురించి మనం తెలుసుకుందాం..

మనలో చాలామంది మన చిన్నప్పుడు చూసే ఉంటారు. ముఖ్యంగా ఊర్లలో తోటల దగ్గర అక్కడక్కడ ఈ చెట్టు ఆ కనిపిస్తూనే ఉంటుంది ఇంతకీ చెట్టు పేరు ఏంటి అనుకుంటున్నారా దీని పేరు తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టు అనేది ఒక దట్టమైన ముళ్ళతో పెరిగే చెట్టు ఇది.
అయితే ఇది ఫాబేసి కుటుంబం లోని ఆకేసి అనే జాతికి చెందిన మొక్క. ఈ చెట్టు కి ఎక్కువగా ముళ్ళు అనేవి పదునుగా ఉంటాయి. అలాగే నల్లని బెరడు, పసుపు రంగులో పూలు ఉండి, కాయలు పొడవుగా పెరిగే ఉంటాయి. అలాగే ఈ చెట్టు అనేది పాకిస్థాన్లోని సింధు ప్రాంతానికి చెందింది. మన భారతదేశంలో కూడా ఈ చెట్టు ఎక్కడ చూసినా విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చెట్టు లో చాలా రకాలు ఉంటాయి. నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ, సర్కారు తుమ్మ అంటూ దాదాపు 160 రకాల తుమ్మ జాతి చెట్లు ఉంటాయి.

వీటిలో కొన్ని చెట్లు అయితే 40 నుండి 70 అడుగుల ఎత్తు వరకు బాగా పెరుగుతాయి. ఈ చెట్టు అంతగా పెరగడానికి ఎవరో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ చెట్టుకి అంతగా నీళ్లు అనేది అవసరం ఉండదు. పొడి వాతావరణంలో అయినా చాలా బాగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రకాల నీళ్లలో ఉంటుంది. ముఖ్యంగా ఎండిన తుమ్మ చెట్టు కొమ్మలను కంచెలుగా పంట పొలాలను పశువుల నుండి రక్షించడానికి చాలా మంది రైతులు ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చెట్టు బొమ్మలు, ఫర్నిచర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే చాలా రకాల పక్షులు, పిట్టలు కానీ ఈ చెట్ల పైన ఎక్కువగా గూడులు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తుమ్మ చెట్టు లో ఉపయోగపడేవి ఏంటంటే దీని ఆకులు కానీ, బెరడు, అలాగే చిగురు, వీటి కాయలు అనేవి ఎక్కువగా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటన్నింటి లో నల్ల తుమ్మ చెట్టులో…

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.