మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా, దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి బారిన పడతారని భయంగా ఉందా, అయితే మీకు ఒక అద్భుతమైన చిట్కా, మస్కిటో కాయిల్స్ కనుక యూస్ చేసినట్లయితే, ఈ విషయం మీరు తెలుసుకోవాలి, ఒక జెట్ కాయిల్ పొగ పీల్చడం అంటే, వంద సిగరెట్లు తాగినట్లే దీనివల్ల మన చేతులారా, మన ఆరోగ్యాన్ని మనం దెబ్బ తీసుకోవడం, కాబట్టి మీకు ఈ టిప్పు చాలా అవసరం, ఈ తీర్పు వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ముందుగా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి..

ఈ మిశ్రమానికి కావలసింది వెల్లుల్లి రెబ్బలు, కర్పూరం, నెయ్యి లేదా, నూనె ఏ రకమైన నూనె అయినా వాడొచ్చు, కొబ్బరి నూనె అయినా వాడవచ్చు, ఒక మట్టిపాత్ర ఇవి మనకు కావాలి, వెల్లుల్లి ఎందుకు అంటే దోమలు ఆ వాసనని తట్టుకోలేవు, కాబట్టి మనం దానిని యూస్ చేస్తున్నాం, అలాగే కర్పూరం వాసన కూడా దోమలు భరించలేవు, ఇక వెల్లుల్లిని కాల్చడానికి కూడా కర్పూరం యూస్ అవుతుంది కాబట్టి, మనం కర్పూరాన్ని యూస్ చేస్తున్నాము.

ముందుగా ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ని తీసుకోవాలి, వాటిని పొట్టుతీసి కచ్చాపచ్చాగా దంచాలి, వాటిని ఆ మట్టిపాత్రలో తీసుకోవాలి, తర్వాత ఐదు ఆరు కర్పూరం బిళ్ళలు తీసుకొని, వాటిని పొడిచేసి ఆ వెల్లుల్లి మీద వేయాలి ఈ రెండూ కూడా మిక్స్ చేయాలి, తర్వాత నెయ్యి లేదా నూనె తీసుకున్న కొబ్బరి నూనె కావచ్చు, ఈ మిశ్రమంతో మళ్ళీ మిక్స్ చేయాలి, పూర్తిగా మిక్స్ అయ్యేంతవరకు, అలా కలుపుతూ ఉండే ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత, ఆ ఆరబెట్టిన మిశ్రమాన్ని తీసుకొని మండించాలి, ఇది చేసే సమయంలో 15 నిమిషాలు తలుపులు, కిటికీలు మూసివేయాలి.

అప్పుడు ఆ వాసనకు దోమలు చనిపోతాయి, కేవలం ఇది ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థం అవుతుంది, ఎంత పవర్ఫుల్ లో ఆ వాసనకి దోమలు అన్ని చచ్చిపోతాయి. డెంగ్యూ భయం మనకు ఉండదు, ఈ టిప్ ని కనుక రెగ్యులర్ గా ఫాలో అయినట్లైతే, అసలు దోమల బెడద అనేది మనకు ఉండదు, మరియు మన ఆరోగ్యానికి కూడా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..